Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రతి సమయంలో స్త్రీలకు ఇబ్బందులు ఎక్కువగా వుంటే?

Advertiesment
శ్రుంగారం
File
FILE
స్త్రీలలో ఎక్కువ మందికి ఏదో ఒక సందర్భంలో పొత్తి కడుపు దగ్గర నెప్పి వస్తుంది. పొత్తి కడుపు అంటే నాభికి, జననాంగానికి మధ్య ఉన్న భాగం. అనేక మందిలో ఈ నొప్పి ఒక రోజులో తగ్గిపోతుంది, లేదా రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. చాలా తక్కువ మందికి మాత్రం అంటే ఒక శాతం కంటే తక్కువ మందికి ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి వారికి ఈ నెప్పి మళ్ళీ మళ్ళీ రావటమే కాక ఇబ్బందులను కలుగజేస్తుంది. మీకు కూడా ఎప్పుడన్నా ఈ నెప్పి రిపీటెడ్‌గా వస్తుంటే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఏ ఏ పరిస్థితుల్లో వస్తోందో గమనించాలి.

మామూలుగా పీరియడ్స్ సమయంలో పొట్ట కింది భాగంలో ఒకవైపు నొప్పి వస్తుంది. అండం విడుదల అయ్యే సమయంలో ఇది రావటం సహజం. అయితే ఉదరం కుడి వైపు భాగంలో నెప్పి వస్తుంటే మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పడాలి. అవసరమైతే డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది.

అదే విధంగా స్త్రీలకు సెక్స్ సమయంలో నొప్పి, లేదా ఇతర రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ నొప్పి కేవలం ఏదో కొన్ని భంగిమలలో మాత్రమే వస్తూ వుంటే మీరు పట్టించుకోనవసరం లేదు. అదేవిధంగా సెక్స్ పరంగా రిజిడిటీ వున్నా, ఉద్రిక్తత చెందకపోయినా కూడా ఇదే సమస్య వస్తుంది.

ఇలా కాకుండా ఎప్పుడూ జననాంగం వద్ద నెప్పిగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫ్యామిలీ డాక్టర్‌కి ఈ విషయం చెప్పవలసి వుంటుంది. రుతుచక్రం సమయంలో నొప్పులు, డిస్ట్రర్బెన్స్‌గా ఫీలవడం మామూలే. కానీ, ఈ నెప్పులు ఇతర సమస్యలు విపరీతంగా, భరించలేనివిగా ఉంటే అది ఏదన్నా వ్యాధికి సంబంధిచినవి కావచ్చు అనేది గుర్తుంచుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu