మామిడికాయ పులిహార ఎలా చేయాలి?
మామిడికాయ సీజన్ అయిపోయినప్పటికీ మామిడి కాయ ఎక్కడైనా మార్కెట్లో పట్టుకొచ్చేసారా.. అయితే వెంటనే మామిడికాయ పులిహార ట్రై చేయండి. కావలసిన పదార్థాలు:సన్న బియ్యం - ఒక కేజీ. మామిడికాయ - 1. ఆవాలు - తాలింపుకు సరిపడానూనె - తగినంతఎండుమిర్చి - 50 గ్రా. పచ్చిమిర్చి - 50 గ్రా. శనగపప్పు - 50 గ్రా. మినపప్పు - 50 గ్రా. కరివేపాకు - 3 రెబ్బలు. పసుపు - చిటికెడుఉప్పు - తగినంత. తయారీ విధానం:ముందుగా పుల్లని మామిడికాయని శుభ్రపరచి - తురుముకోవాలి. అన్నం వార్చి బేసిన్లో పోసి, పసుపూ, నూనెవేసి కలపాలి. చల్లారాక మామిడి తురుమూ ఉప్పూ వేసి కలపాలి. చివరలో నూనె మరిగించి తాలింపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి తిరగమోత పెట్టుకుంటే.. మామిడి పులిహార రెడీ అయినట్లే.