భార్యాభర్తల మధ్య అనుబంధం సజీవంగా కొనసాగాలంటే...
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాల కోసమో, వ్యాపార పనులకు వెళ్లిపోవడం.... ఏ రాత్రికో ఇంటికి చేరడం ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలకు అలలవాటైపోయింది. ఎంత కష్టపడుతున్నా, ఇద్దరి మధ్యా అనుబంధం సజీవంగా కొనసాగ
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాల కోసమో, వ్యాపార పనులకు వెళ్లిపోవడం.... ఏ రాత్రికో ఇంటికి చేరడం ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలకు అలలవాటైపోయింది. ఎంత కష్టపడుతున్నా, ఇద్దరి మధ్యా అనుబంధం సజీవంగా కొనసాగాలంటే సరిదిద్దుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటే తెలుసుకుందాం..
ఇద్దరి మధ్య ప్రేమ రోజురోజుకీ తగ్గిపోతోందని ఇద్దరికీ అనిపిస్తోందా? దీనికి చిన్న చిన్న మార్పులే ఎంతో మేలు చేస్తాయి. ప్రేమను తెలియజేసేందుకు అప్పుడప్పుడూ ఓ గ్రీటింగ్ కార్డో, చిరు కానుకో ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. అలాగే చేతిలో చేయ్యేసి మాట్లాడుకోవడం, పక్కపక్కన కూర్చొని కబుర్లు చెప్పుకున్నప్పుడు ఒకరి భుజం మీద మరొకరు వాలి విశ్రాంతి తీసుకోవడంలాంటివన్నీ అనుబంధాన్ని పెంచుతాయి.
కానీ, ఇద్దరిమధ్యా ఎలాంటి సమస్యా లేదు. అయినా భాగస్వామి మాట్లాడితే చిరాకు ఏదైనా అడిగితే కోపం. ఇలాంటి తీరు ఇద్దరిలోనూ కనిపిస్తుంటే దాన్ని సాధ్యమైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. అసలైన కారణాన్ని తెలుసుకుని, పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.