Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ జీవిత భాగస్వామికి గౌరవం ఇస్తున్నారా? లేదా?

Advertiesment
relationhip
, బుధవారం, 2 జులై 2014 (16:04 IST)
ఆధునికత మహిళను ఉన్నతస్థాయికి చేర్చింది. అయినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సంగతిని కాసేపు పక్కన బెడితే ఆధునిక యువతులు చదువుతో పాటు తమ కంటూ సమాజంలో ఓ స్థానాన్ని సంతరించుకుంటున్నారు. మహిళ వ్యక్తిత్వం ప్రస్తుతం పురుషులతో పోటీ పడుతోంది. 
 
చదువు, ఉద్యోగం, కెరీర్‌, ఆ తర్వాతే పెళ్లి. జీవిత ప్రాముఖ్యతల్లో మొదటి స్థానంలో ఉండే పెళ్లి నాల్గవ స్థానానికి వెళ్లింది. చదువు, ఉద్యోగం, కెరీర్‌, పెళ్లి ఇలా ఆలోచించే నేటి మహిళలు వారి వైవాహిక జీవితంలో కూడా జీవితభాగస్వామి నుండి తమకంటూ కొంత సమయాన్ని కోరుకుంటున్నారు. 
 
మీ లవర్ మీ జీవిత భాగస్వామి గృహిణి లేదా వర్కింగ్ ఉమెన్ అయినా ఎలా గౌరవించాలో తెలుసా? అయితే టిప్స్ పాటించండి. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. 
 
చిట్కాలు: 
* ఆఫీసు నుండి వచ్చిన మీ భర్త/భార్య రాగానే అనవసరమైన ప్రశ్నలతో వేధించక కాసేపు వారిని ఒంటరిగా, ప్రశాంతంగా వదిలేయండి. 
 
*  మీ భర్త/భార్య ఆసక్తి చూపని మీ ఆఫీసు పార్టీలకు, ఫంక్షన్లకు రమ్మని బలవంతపెట్టకండి. 3. మీ జీవిత భాగస్వామి వారి స్నేహితులతో బయటకెళ్లడానికి ప్రోత్సహించండి. 
 
* టీవీ రిమోట్‌ మీ చేతిలో పెట్టుకుని, మీకిష్టమైన ప్రోగ్రామ్స్‌ను మాత్రమే చూడకండి. మీ జీవిత భాగస్వామికి కూడా ఇష్టమైన ప్రోగ్రామ్‌లు చూడటానికి అవకాశమివ్వండి. 
 
* మీరు ఆఫీసు పనితో అలసిపోయి ఇంటికి రాగానే అల్లరిచేయకుండా ఉండేలా మీపిల్లలను ట్రైన్‌ చేయండి.  
 
* పిల్లల పెంపకంతో పాటు ఇంట్లో వారి అవసరాలను మీ భార్యకు మాత్రమే పరిమితం చేయకండి 
 
* మీ భార్య/భర్త ఆలోచనలకు గౌరవం ఇవ్వండి. అందులోని మంచిని చెడును గ్రహించండి. 
 
ఈ చిట్కాలు పాటిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని సైకాలజిస్టులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu