Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

ఆ ప్రేమ లేకపోతే అతను ప్రేమించి కూడా వేష్టే....

Advertiesment
women
, గురువారం, 8 నవంబరు 2018 (15:22 IST)
ఈ కాలంలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, కొందమందికి ప్రేమ గురించి అంతగా తెలియదు. అయినా కూడా చూసిన వారందరిని ప్రేమిస్తుంటారు. కానీ అమ్మాయిలు మాత్రం అసలు తిరిగి కూడా చూడరు. సాధరణంగా చెప్పాలంటే.. ఒక అమ్మాయి.. ఓ అబ్బాయి దగ్గర ఎదురుచూసేది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమ లేకపోతే అతను ప్రేమించి కూడా వేష్టే.. మరి ఆ ప్రేమను ఎలా ఇవ్వాలో.. ఎలా తీసుకోవాలో చూద్దాం..
 
1. ముందుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే ఇతరులను అర్థం చేసుకోగలం. ఓ అమ్మాయి.. మెుదటగా అబ్బాయి దగ్గర ఎదురు చూసేది.. భౌతిక ప్రదర్శన. ఇది కరెక్ట్‌గా ఉంటేనే చాలు అమ్మాయిలు ప్రేమలో పడిపోతారు.
 
2. పురుషులు ఆరోగ్యపరంగా తీసుకునే జాగ్రత్తలు కూడా వారికి నచ్చుతాయి. సాధారణంగా కొందరు స్త్రీలు అనుకునే మాట ఒక్కటే తను ఆరోగ్యంగా ఉంటేనే కదా నన్ను అలానే చూసుకుంటాడు అనే భావం ఏ స్త్రీలోనైనా ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. 
 
3. మీరు చూసే చూపు, నడిచే నడక అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. ముఖ్యంగా ఆ వ్యక్తి శుభ్రంగా ఉండాలి. ఇలా ఉండాలంటే.. మీరు కాస్త ఆచరణలో ఉంటే.. వారు తప్పకుండా మీ వ్యక్తిత్వాన్ని గుర్తిస్తారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. 
 
4. మీరు చేయాలనుకున్న విషయాన్ని ధైర్యంగా ఆమె దగ్గర చెప్పాలి. ఆ విషయంలో కూడా స్త్రీలకు మీరు నచ్చే అవకాశాలున్నాయి. కనుక అధైర్యాన్ని వదలిపెట్టండి.
 
5. ఇతరులతో వ్యవహరించే విషయాల్లో కూడా స్త్రీలు మిమ్ములను గమనిస్తారు. కుటుంబీకులకు ఎలా మర్యాద ఇస్తారో.. ఇతరులకు కూడా అదే మర్యాద ఇవ్వాలి. ఇంట్లో వాళ్లని ఒకవిధంగా.. బయటవారికి మరోవిధంగా చూడకూడదు. 
 
ఈ పద్ధతులు పాటిస్తే చాలు.. తప్పకుండా మీరు చేయాలనుకున్న విషయాలు కచ్చితంగా జరుగుతాయి. జీవితంలో సంతోషంగా ఉంటారు. దాంటో పాటు ఈ ఒక మాట.. ఇది సాధారణగా అందరూ చెప్పే మాటే.. ''గివ్ రెస్‌పెక్ట్ అండ్ టేక్ రెస్‌పెక్ట్''. ఈ పద్ధతి ఒక్కటుంటే చాలు.. ఈ లోకంలో వారే విజయం సాధిస్తారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎలాంటి వారు విడాకులు కోరవచ్చు...