Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రతి క్రియ...కొన్ని నియమాలు

Advertiesment
రతి క్రియ మనిషి విచ్ఛలవిడి శృంగారం జీవితం సుఖమయం
FileFILE

రతిక్రియ అనేది ప్రతి ప్రాణికి అవసరం. అందులో మనిషికైతే మరీనూ... ఆధునిక పోకడలు నానాటికి పెరగిపోతున్న ఈ రోజుల్లో మానవుడు విచ్ఛలవిడి శృంగారాన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ప్రతి దానికి నియమాలున్నట్లే శృంగారానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని పాటిస్తే జీవితం సుఖమయం.

*ముఖ్యంగా పగటిపూట రతిలో పాల్గొనకండి. రతి (మైథునం) లోపాల్గొనాలంటే రాత్రిపూట మాత్రమే పాల్గొనాలి. అదికూడా ఒక్కసారి మాత్రమే. కాస్త విరామమిస్తూ పాల్గొంటే ఆ ఆనందం వేరు.

*సూర్యోదయానికి పూర్వం రతిలో పాల్గొనడం ఆరోగ్యానికి హానికరం.

*ఎవరైతే రాత్రి 7 నుండి 8 గంటలలోపు భోజనం ముగిస్తారో వారు సంతోషంగా రతిలో పాల్గొనగలుగుతారు. కాని రాత్రి 10..11గంటల మధ్య భోజనం చేసేవారు అర్ధరాత్రి తర్వాత రతిలో పాల్గొంటే ఆరోగ్యదాయకం.

*కొంతమంది రతికార్యం అంటే వీర్యస్ఖలనం కాగానే తమ పనైపోయినట్లు భావిస్తారు. కాని ఆలోచించదగ్గ విషయం ఏంటంటే వీర్యస్ఖలనం కాగానే అటు పురుషులకు కాని, ఇటు స్త్రీలకు కాని రతిలో పాల్గొన్నామన్న మాటేకాని తృప్తి అనేది ఉండదు.
రతిలో పాల్గొనే ముందు ఒకరినొకరు బాగా ప్రేరేపించుకోవాలి, ముఖ్యంగా పురుషుడు స్త్రీలోని కామనాడులను ప్రేరేపించి ఆతర్వాత రతిలో పాల్గొంటే ఇద్దరూ సుఖానుభూతిని పోందగలరు.
webdunia
WD


*కొంతమంది పురుషులు తమభాగస్వామి పరిస్థితి తెలుసుకోకుండా రతిలో పాల్గొంటుంటారు, వారి మానసిక, శారీరిక పరిస్థితి వీరికి అవసరం లేదు. వారికి కావలసిందల్లా తాము రతిలో పాల్గొన్నామా లేదా అన్నదే వారి భావన.
భార్యాభర్తల్లో ఎవరైనా సరే ఒకరి మానసిక పరిస్థితి సరిగా లేనప్పుడు మరొకరు రతికి ఉపక్రమించకూడదు. భార్యాభర్తలిరువురు ప్రశాంత వదనంతో ఉన్నప్పుడే రతిలో పాల్గొనాలి.
*రతిలో పాల్గొన్నప్పుడు ఆసనాలు వేయడం ఆనందదాయకమే, కాని వాటి గురించి పూర్తి అవగాహన ఉండాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.

*రతిలో పాల్గొన్నతరువాత వెంటనే నీళ్ళు తాగకూడదు. స్వీట్లు లేదా కలకండ, బెల్లం లాంటి తీపి పదార్థాలు తీసుకోవాలి. కాసేపు తర్వాత నీళ్ళను త్రాగాలి.

*కొంతమంది రతిలో పాల్గొన్న తర్వాత తమ మర్మావయాన్ని చన్నీటితో కడుక్కుంటారు ఇది ఆరోగ్యానికి హానికరం. మెత్తటి గుడ్డతో తుడుచుకోవచ్చు.

*మైథునమైన వెంటనే వ్యాహాళికి వెళ్ళకూడదు.

*పురుషులు తమకన్నా ఎక్కువ వయసు కలిగిన మహిళలతోనూ, మరీ తక్కువ వయసు కలిగిన అమ్మాయిలతో సంభోగం చేయకూడదు. ఇది శాస్త్ర విరుద్ధం.

*సాధారణంగా పురుషులు తమలో లోపాలు ఉన్నాయని తెలిసీ తెలియని మందులు, వివిధ ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాచేయడం సమంజసం కాదు. కాబట్టి ప్రముఖ వైద్యుణ్ణి సంప్రదించి తగు సూచనలు పాటించాలి.

ఈ సూచనలు పాటిస్తూ తమ జీవితాన్ని సుఖమయంచేసుకోవాలని వైద్యులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu