Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోక్‌సభ ఎన్నికలు : 26న వారణాసిలో మోడీ నామినేషన్ దాఖలు

Advertiesment
లోక్‌సభ ఎన్నికలు : 26న వారణాసిలో మోడీ నామినేషన్ దాఖలు
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (11:58 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు మూడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందులోభాగంగా ఆయన గురువారం వారణాసిలో రోడ్‌షో నిర్వహించనున్నారు. 
 
బీజేపీ అభ్యర్ధిగా వారణాసి లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేస్తున్న ప్రధాని మోడీ.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వారణాసి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి బెనారస్ హిందూ యూనివర్సిటీ గేట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీ పురాతన మందిరాలు, గంగా నది ఘాట్లను కలుపుతూ ముందుకు సాగనుంది. 
 
ఈ ర్యాలీలో బీజేపీ సీనియర్ నేతలు, ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన నేతలు కూడా పాల్గొననున్నారు. 'దశాశ్వమేథ్' ఘాట్ వద్ద సాయంత్రం 7 గంటలకు ర్యాలీ ముగించి గంగా హారతిలో పాల్గొంటారు. మోడీ. నగరంలోని ప్రముఖులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. 
 
ఇక శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ వేసే ముందు ఉదయం 9 గంటల సమయంలో బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం కాలభైరవ ఆలయంలో పూజలు చేసి కలెక్టరేట్‌లో నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. నామినేషన్ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ వెంట బీజేపీ నేతలతో సహా, ఉద్దవ్ థాక్రే, నితీశ్ కుమార్ వంటి ఎన్డీయే మిత్రపక్షాలకు చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐమాక్స్ మిర్రర్ మేజ్‌లో బాలికల పట్ల ఉద్యోగి అసభ్య ప్రవర్తన... మూడేళ్ల జైలు