Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణా పుష్కరాలకు ప్రతి అధికారి, ఉద్యోగి పనితీరుపై రేటింగ్ ఇస్తాను : సీఎం చంద్రబాబు

అమరావతి: కృష్ణా పుష్కరాలపై కృష్ణా, గుంటూరు, కర్నూలు కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. యాత్రీకుల సేవకు, ప్రజాసేవకు కృష్ణానదీ పుష్కరాలు ఒక అవకాశం, మన సమర్ధత నిరూపించుకునే అవకాశం,ఎక్కడా ఎలాంటి

Advertiesment
krishna pushkaras 2016
, గురువారం, 4 ఆగస్టు 2016 (13:36 IST)
అమరావతి: కృష్ణా పుష్కరాలపై కృష్ణా, గుంటూరు, కర్నూలు కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు. యాత్రీకుల సేవకు, ప్రజాసేవకు కృష్ణానదీ పుష్కరాలు ఒక అవకాశం, మన సమర్ధత నిరూపించుకునే అవకాశం,ఎక్కడా ఎలాంటి చిన్న సమస్య కూడా ఉత్పన్నం కాకుండా చూడాలని, పుష్కరాల నిర్వహణ పనుల్లో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని చంద్రబాబు అన్నారు. 
 
ప్రజల్లో సంతృప్తి నెలకొనాలని, ఇంత బాగా చేయగలుగుతారా అని ఆశ్చర్యపోయేలా అన్నిశాఖల అధికారులు చక్కని సమన్వయంతో సమర్ధంగా పనిచేయాలని సీఎం తెలిపారు. అలమట్టి, జూరాల నుంచి ఇన్‌ఫ్లో వస్తోందని, అన్ని రిజర్వాయర్లు నీటితో నింపుకోవాలని, పుష్కరాలకు నీటి నిర్వహణ సక్రమంగా చేయాలని, నీటి విడుదలపై జలవనరుల శాఖ సిద్ధం చేసుకున్న పుష్కర ప్రణాళికను అమలు చెయ్యాల‌ని తెలిపారు.
 
సముద్రంలోకి వృధాగా నీరు పోకూడ‌ద‌ని,బారికేడింగ్ పకడ్బందీగా ఉండాలని అన్నారు. ఘాట్‌ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఒక్క కాగితం ముక్క కూడా రోడ్లపై కనిపించకూడదని, పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరచాలని, యాత్రీకుల రద్దీ అధికంగా ఉండే అన్ని ఘాట్‌ల వద్ద చంద్రన్న సంచార వైద్యశాల(మెడికల్ మొబైల్ యూనిట్లు) ఏర్పాటుచేయాలని, అత్యవసర మందులు, వైద్యం అందుబాటులో ఉంచాలని సీఎం తెలిపారు. 
 
వసతులపై, సదుపాయాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలని, ప్రజాభిప్రాయం సేకరించాలని, మైక్రోసాఫ్ట్ మాడ్యూల్ టెక్నాలజీని వినియోగించుకోవాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి లోపం జరగకూడదని, ఏ శాఖపై కూడా ఒక్క విమర్శ కూడా రాకూడదని, ఆకస్మిక తనిఖీలు చేయాలని, అందరూ అప్రమత్తంగా ఉండాలని, వివిధ శాఖలకు చెందిన 571 మంది అధికారులతో ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్స్ తీసుకుంటానని, ప్రతి అధికారి, ఉద్యోగి పనితీరుకు రేటింగ్ ఇస్తానని సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపు శ్రావణ శుక్రవారం... శ్రావణ మాస విశిష్టత...