పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ...!
తాత్పర్యం :
తండ్రికి కుమారుడు పుట్టగానే సంతోషం కలుగడం సాధారణమే. అయితే, ఆ కుమారుడిని చూసి పదిమంది ప్రజలూ మెచ్చుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందని... ఈ పద్యంలో చెబుతున్నాడు సుమతీ శతకకారుడు.