జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలిపరమానంద రామ గోవిందా.. జో... జో...
తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా వేసి
నాలుగు వేదములు గొలుసులమరించీ
చిత్తమనియేటి దూలములు వేసి
అందముగ జాంబవతి చందనముపుయ్యా
పొందుగాకాళింది పువ్వులందియ్యా
ఇందుముఖి లక్షణా వింజామరెయ్యా
చట్టు గోప స్త్రీలు తొట్టెనూచంగా
కోట్ల రంగారాజు కోర్కు లొసంగంగా... జో... జో...!