అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ..! వినుర వేమ...!
తాత్పర్యం :
అల్పబుద్ధి కలిగినవాడు ఎప్పుడూ.. డాంబికాలు పోతూ, ఆడంబరంగా మాటలు చెప్పుకుంటాడు. అదే శాంత స్వభావి మాత్రం సున్నితంగా మాట్లాడుతాడు, ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు. కంచు శబ్దం చేసినట్లుగా, బంగారం శబ్దం చేయదు కదా..! అలాగే అల్బబుద్ధి కలిగినవాడిని కంచుతోనూ, శాంత స్వభావిని బంగారంతో పోల్చాడు ఈ పద్యంలో వేమన మహాకవి.