Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అదివో అల్లదివో శ్రీహరివాసము

Advertiesment
బాలప్రపంచం
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము "అదివో"

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము "అదివో"

చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము "అదివో"

కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో
పావనములకెల్ల పావనమయము "అదివో"

Share this Story:

Follow Webdunia telugu