పిల్లలకు టీకాలు వేయిస్తున్నారా? ఉదయం పూటే బెస్ట్.. మధ్యాహ్నం, రాత్రి వద్దే వద్దు!
వ్యాధి నిరోధిక టీకాలను పిల్లలకు వేయిస్తున్నారా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మూడు పూటల్లో ఎప్పుడు వేయించాలో తెలుసా అయితే ఈ స్టోరీ చదవండి. వాక్సీనులను చిన్న పిల్లలకు నోటిద్వారా లేదా ఇంజక్షను ద్వారా ఇచ్చ
Publish Date: Tue, 16 Aug 2016 (17:42 IST)
Updated Date: Tue, 16 Aug 2016 (17:46 IST)
వ్యాధి నిరోధిక టీకాలను పిల్లలకు వేయిస్తున్నారా? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మూడు పూటల్లో ఎప్పుడు వేయించాలో తెలుసా అయితే ఈ స్టోరీ చదవండి. వాక్సీనులను చిన్న పిల్లలకు నోటిద్వారా లేదా ఇంజక్షను ద్వారా ఇచ్చినప్పుడు వారి శరీరంలో "అంటీ బాడీలు" అనే పదార్థములు తయారయి, అవి బిడ్డలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
వ్యాధి నిరోధక టీకాలతో నిరోధించగలిగే ఆరు ప్రాణాంతక వ్యాధులు -క్షయ, గొంతువాపు, కోరింత దగ్గు , ధనుర్వాతం, పోలియో, తట్టు వ్యాధులకు టీకాలు ఇవ్వడం మొదలు పెట్టారు. తర్వాత ఈ కార్యక్రమంలో ‘‘హైపటైటెస్-బి’’ అనే టీకాను కూడా చేర్చారు. వ్యాధి నిరోధక టీకాల వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మశూచి వ్యాధిని నిర్మూలించారు. అలాంటి వాక్సీన్లను ఉదయాన్నే వేయించుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుందని లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సీన్లను అరవయ్యేళ్లు దాటిన వాళ్లకు ఇచ్చినప్పుడు వాళ్లలో మధ్యాహ్నం, సాయంత్రంతో పోలిస్తే ఉదయాన్నే వ్యాక్సీన్ వేయించుకున్నవాళ్లలో యాంటీబాడీల ఉత్పత్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అంటే రోగనిరోధకశక్తి రోజంతా ఒకేవిధంగా ఉండదన్నది అర్థమవుతోంది.
సాధారణంగా వయసు పెరిగేకొద్దీ రోగనిరోధకశక్తి తగ్గిపోతుంటుంది. కేవలం ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా రెండున్నర నుంచి ఐదు లక్షల మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ కొత్త పరిశోధన ఆధారంగా ఇన్‌ఫ్లూయెంజా వ్యాధిని తగ్గించే అవకాశం ఉందని వాళ్లు చెబుతున్నారు. అందుచేత పిల్లలకు వాక్సీన్లను ఉదయం పూట వేయించడం అలవాటు చేసుకోండి.
Selvi
Publish Date: Tue, 16 Aug 2016 (17:42 IST)
Updated Date: Tue, 16 Aug 2016 (17:46 IST)