Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్షులు ఒక్కదానికొకటి సహాయం చేసుకుంటాయి.

Advertiesment
పక్షులు
, సోమవారం, 21 నవంబరు 2011 (15:50 IST)
FILE
పక్షుల్లో కూడా తల్లి పక్షులు పిల్ల పక్షులకు ఆహారాన్ని అందించడానికి ఇతర పక్షుల సహాయాన్ని తీసుకుంటాయి. పిల్లల్ని పొదిగిన పక్షిజంట వాటి బంధువుల అంటే ఆ తల్లి లేదా తండ్రి పక్షులతో పాటు కలిసి పుట్టిన ఆడ, మగ పక్షుల సహాయం తీసుకుంటాయి. సహాయం చేసే పక్షులకు పిల్ల పక్షులు ఉండని సందర్బంలోనే ఇలా సహాయం చేస్తాయి.

ఒక్కోసారి ఎలాంటి బంధుత్వం లేకపోయినా సహాయం చేస్తాయి. కానీ ఎక్కువ శాతం ఆ పక్షి జంటకు అంతకు ముందు పుట్టిన పక్షులు సహాయాన్ని అందిస్తాయి. 'రెడ్‌థ్రోటెడ్ బీ ఈటర్స్' అనే పక్షులు పిల్లల్ని పెంచడానికి ఇతర పక్షుల సహాయాన్ని ఎక్కువగా తీసుకుంటాయి. సహాయం చేసిన పక్షులు గనుక ఒకవేళ ఆ మరుసటి సంవత్సరం గూడు కట్టుకునేటట్లయితే అవి పెంచిన పిల్లలు వాటికి సహాయం చేస్తాయి. కాకులు కూడా ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu