సోషల్ మీడియాలో అగ్రగామి అయిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ త్వరలోనే రాబోతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ పేరు 'వ్యూ వన్స్'. యూజర్లు పంపిన ఫొటోలు, వీడియోలు ఒకసారి చూసిన తర్వాత వాటంతట అవే మాయమైపోతాయి.
బీటా టెస్టర్ల కోసం ఆండ్రాయిడ్ 2.21.14.3 వెర్షన్‌లో అందుబాటులో వుందని వాట్సాప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిసప్పియరింగ్ మెసేజెస్‌లానే ఇది కూడా పనిచేస్తుంది. గతేడాది నవంబరులో డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే, వ్యూ వన్స్ ఫీచర్‌లో టైం పిరియడ్ అంటూ ఏమీ ఉండదు. ఫొటోలు కానీ, వీడియోలను కానీ ఒకసారి చూసిన తర్వాత వాటంతట అవే మాయమైపోతాయి. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయంలో ఇప్పటి వరకు వాట్సాప్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.