Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాకు టిక్ టాక్ షాక్.. వీడియోలు డిలీట్.. ఆ ప్రయత్నంలో రిలయన్స్ ఇండస్ట్రీస్?

Advertiesment
TikTok
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (19:29 IST)
చైనా కారణంగా భారత్, అమెరికా వంటి దేశాలు టిక్ టాక్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపఖ్యంలో కంటెంట్ విషయంలో అభ్యంతరాలున్న 3 లక్షల 80 వేలకు పైగా వీడియోలను టిక్ టాక్ తొలగించింది. అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ఈ వీడియోలు వున్నాయని టిక్ టాక్ పేర్కొంది.
 
కరోనాను నియంత్రించడంలో చైనా విఫలమైందని.. ఇంకా సరిహద్దు వివాదం కారణంగా చైనా యాప్‌లపై భారత్ కొరడా ఝళిపించింది. టిక్‌టాక్‌తో పాటు వందలాది యాప్‌లను భారత్ తొలగించి గట్టి దెబ్బకొట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు చెందిన 1300 అకౌంట్లలో దురుద్దేశ పూరిత కంటెంట్ వుందని టిక్‌టాక్ యాజమాన్య సంస్థ బైట్ డాన్స్ తెలిపింది.
 
జీరో టోలరెన్స్ పాలసీకి అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది. టిక్‌టాక్‌లో వచ్చే వీడియోలు యువతను తప్పుదారి పట్టించేలా వున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. కంటెంట్ అడ్వైజరీ కౌన్సిల్ నివేదిక ప్రకారం టిక్ టాక్ కంపెనీ చర్యలు చేపట్టింది.
 
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల పెట్టుబడులతో దూసుకుపోతున్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టిక్ టాక్ ను కోనుగోలు చేయనుందన్న అంచనా ఆసక్తికరంగా మారింది. టిక్ టాక్ యజమాన్య సంస్థ బైట్ డాన్స్ తో ప్రారంభ దశ చర్చలు జరుపుతోంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి కోసం 23న అంబేద్కర్, న్యాయదేవతల విగ్రహాల వద్ద నిరసన