ట్విటర్ పక్షికి విముక్తి లభించిందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌ను ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన స్పందిస్తూ, "పక్షికి విముక్తి లభించింది" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ట్విటర్లోని నీలి రంగు పక్షి ఉండటం గమనార్హం.
ట్విటర్ కొనుగోలు డీల్ పూర్తి చేసి మస్క్ గురువారం దానికి కొత్త యజమాని అయ్యారు. అయితే, తనను తప్పుదారి పట్టించారని, సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ కోసం తాను వివరించిన ఉన్నతమైన ఆశయాలను ఎలా సాధించాలనే దానిపై సరైన స్పష్టత లేదంటూ టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. సీఈఓ పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దెలను తొలగించారు.