'సమ్మర్ సర్‌ప్రైజ్' పేరుతో రిలయన్స్ జియో అద్భుత ఆఫర్... ఒక నెల రీచార్జ్‌తో 2 నెలలు ఫ్రీ
రిలయన్స్ జియో అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. సమ్మర్ సర్‌ప్రైజ్ పేరుతో ఈ ఆఫర్‌ను సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన విషయం తెల్సిం
రిలయన్స్ జియో అద్భుత ఆఫర్‌ను ప్రకటించింది. సమ్మర్ సర్‌ప్రైజ్ పేరుతో ఈ ఆఫర్‌ను సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం రూ.303తో రీచార్జి చేసుకుంటే 28 జీబీ 4జీ డేటా (రోజుకు 1 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పొందొచ్చు. రూ.303తో ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు. అంతేగాక నెలకు అదనంగా 5 జీబీ 4జీ డేటా ఉచితంగా పొందవచ్చు.
అలాగే, రూ.499తో రీచార్జి చేసుకుంటే 56 జీబీ 4జీ డేటా (రోజుకు 2 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు.. ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు, దీనిలో నెలకు అదనంగా 10 జీబీ 4జీ డేటా కూడా ఉచితంగా పొందవచ్చు. రూ.999తో రీచార్జి చేసుకుంటే 60 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 3 నెలల వాలిడిటీతో అదనంగా 100 జీబీ ఉచిత డేటాతో అందిస్తోంది.
రూ.1999తో రీచార్జి చేసుకుంటే 125 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 90 రోజుల కాల వ్యవధితో అందిస్తోంది. దీంతో అదనంగా 100 జీబీ ఉచిత డేటా కూడా పొందవచ్చు. రూ.4999తో రీచార్జి చేసుకుంటే 350 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఆరునెలల వరకు పొందవచ్చు. ఇక రూ.9999తో రీచార్జి చేసుకుంటే 750 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 360 రోజుల వరకు పొందవచ్చు. ఈ ఆఫర్లకు కూడా అదనంగా 100 జీబీ ఉచిత డేటా అందిస్తోంది. రూ.149 రీచార్జ్ ఆఫర్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.