స్మార్ట్ ఫోన్-ఇంటర్నెట్.. నలుగురు విద్యార్థుల అసహజ లైంగిక ప్రక్రియ.. వీడియో తీసి?
స్మార్ట్ ఫోన్, టెక్నాలజీలతో నలుగురు విద్యార్థులు తప్పటడుగు వేశారు. ఇంటర్నెట్ సాయంతో వీక్షించిన వీడియోల ద్వారా రేకెత్తిన ఆలోచనలతో నలుగురు విద్యార్థులు తప్పటడుగు వేశారు. వికృతచేష్టలతో అసహజ లైంగిక ప్రక్
స్మార్ట్ ఫోన్, టెక్నాలజీలతో నలుగురు విద్యార్థులు తప్పటడుగు వేశారు. ఇంటర్నెట్ సాయంతో వీక్షించిన వీడియోల ద్వారా రేకెత్తిన ఆలోచనలతో నలుగురు విద్యార్థులు తప్పటడుగు వేశారు. వికృతచేష్టలతో అసహజ లైంగిక ప్రక్రియలకు అలవాటుపడ్డారు. పాఠశాలకు వెళ్తున్నామంటూ చెప్పి ఏకాంతంగా గడిపేందుకు నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లేవారు.
తమతో ఆడుకునేందుకు రమ్మంటూ మరోపిల్లాడితో ఇదేవిధంగా ప్రవర్తించారు. ఆ దృశ్యా లను మొబైల్‌ఫోన్లలో బంధించి డబ్బులు డిమాండ్ చేసే స్థాయికి చేరారు. తల్లిదండ్రులను ఉలికిపాటుకు గురిచేసిన ఈ ఘటన బాధిత బాలుడి తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఓల్డ్‌మలక్‌పేట ప్రాంతంలోని ఓ బస్తీలో నలుగురు పిల్లలు కలిసుండేవారు. రోజూ పాఠశాలకు వెళ్తున్నామని చక్కగా రెడీ అయి వెళ్లేవారు. కానీ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకునేవారు. ఆ బ్యాచ్‌లో పెద్దవాడైన పిల్లాడి చేతికి మొబైల్‌ఫోన్ వచ్చింది. మొదట్లో వీడియోగేమ్స్‌తో ఎంజాయ్‌చేశారు. అశ్లీల చిత్రాలు.. ఫోర్న్‌సైట్స్‌లోకి వెళ్లిపోయారు. కొద్దిరోజులుగా వారి ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు రావటం మొదలైంది.
వికృతచేష్టలతో ప్రారంభించి అసహజ లైంగిక చేష్టలకు అలవాటుపడ్డారు. ఈ సమయంలోనే బస్తీకు చెందిన 12 ఏళ్ల బాలుడిపై అసహజ చర్యకు పాల్పడ్డారు. ఆ తతంగాన్నంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ వీడియో ఆధారంగా ఇంట్లో నుంచి డబ్బు తేవాలని బెదిరింపులు మొదలెట్టారు.
అయితే ఈ విషయాన్ని బాధిత బాలుడు తల్లిదండ్రులకు తెలపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల కారణంగానే యువత ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని పోలీసులు అంటున్నారు.