Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 4న నథింగ్ 3a సీరీస్ విడుదల

Advertiesment
Nothing Phone 3a Series

ఐవీఆర్

, గురువారం, 30 జనవరి 2025 (18:33 IST)
మార్చి 4న నథింగ్ 3a సీరీస్ విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా, 'నథింగ్' యొక్క సహ-వ్యవస్థాపకులు అకిస్ ఎవాంజిలిడిస్ మాట్లాడుతూ... “(a) సీరీస్ కోసం మేము విభిన్నమైన వాడుకదారుల కూర్పును కలిగి ఉన్నాము. ప్రజలు స్మార్ట్‌ఫోన్‌‌ని కొనుగోలు చేసేటప్పుడు, కొందరు గొప్ప ఆకాంక్షలతో ఉంటారు, వారు అత్యాధునిక ఆవిష్కరణలు, ప్రాసెసర్లను కోరుకుంటారు. అయినా, టెక్నాలజీ గురించి అంతే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న మరికొందరు వాడుకదారులు కేవలం గొప్ప వాడుకదారు అనుభవంతో సంతోషపడతారు. ఈ (a) సిరీస్ అటువంటి వారి కోసమే. కెమెరా, స్క్రీన్, ప్రాసెసర్, డిజైన్ విషయంగా మేము నిజంగా వాడుకదారుల ముఖ్య అవసరాలపై దృష్టి సారించాము.”
 
అదనంగా, అక్టోబర్ 2020లో అనగా కేవలం నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించబడినప్పటి నుండీ కంపెనీ తన జీవితకాల రాబడిలో $1 బిలియన్‌‌ని అధిగమించిందని అప్‌డేట్ యందు 'నథింగ్' వెల్లడించింది. 'నథింగ్' యొక్క ముఖ్య ఫైనాన్షియల్ అధికారి, టిమ్ హోల్‌బ్రో ఇలా జోడించారు: “ఆ రాబడిలో సగానికి పైగా కేవలం గత 2024 సంవత్సరంలోనే వచ్చింది. మరి అత్యంత సంతోషదాయకమైన విషయమేమిటంటే, మేము ఖచ్చితంగా చేయాలనుకున్నదే చేశాము.
 
ఫోన్ (2), ఇయర్ (2) విజయాలపై ఫోన్ (2a), ఫోన్ (2a) ప్లస్, CMF ఫోన్ 1 లతో నిర్మించాలని లక్ష్యంగా చేసుకొని మేము 2024 సంవత్సరం లోనికి అడుగు పెట్టాము. మేము ఆ ఉత్పాదనల్ని మార్కెట్‌ లోనికి తీసుకువచ్చాము మరి మా బిజినెస్ వ్యాప్తంగా స్థాయి పెంపుదలను ప్రారంభించాము. అది సహజంగానే మాకు అద్భుతమైన అగ్రస్థాయి రాబడి వృద్ధిని అందిస్తుంది. దానిని సాధించడం పట్ల మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది మరియు 2025 లో మేము ఏమి సాధించగలమో చూసేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము. ”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

WhatsApp Update: వాట్సాప్, iOS వినియోగదారులకు వ్యూ వన్స్ ఫీచర్.. కానీ?