అసలే లాక్‌డౌన్.. ఏటీఎంల వెంట పడకుండా నెఫ్ట్, ఆన్ లైన్ లావాదేవీలు కానిచ్చేస్తున్నారు జనం. అయితే తాజాగా నెఫ్ట్ సేవలు 14 గంటల పాటు నిలిచిపోనున్నాయి. దాదాపు 14 గంటల పాటు నెఫ్ట్ ఆన్ లైన్ లావాదేవీలకు అంతరాయం ఏర్పడనుంది. మే 23 ఆదివారం 14 గంటల వరకు నెఫ్ట్ సేవలు పనిచేయవమని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక ప్రకటనలో వెల్లడించింది.
సాంకేతిక కారణాల రీత్యా నెఫ్ట్ సేవలు నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. టెక్నికల్ అప్ గ్రేడ్ కోసం మే 22న బిజినెస్ అవర్స్ ముగిసిన తర్వాత సాప్ట్ వేర్ అప్ గ్రేడ్ చేయనున్నట్టు తెలిపింది. మే 23న 00.01 గంటల నుంచి (మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి) మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు.
మరోవైపు ఆర్టీజీఎస్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఆర్‌బీఐ తెలిపింది. నెఫ్ట్ సేవలకు సంబంధించి ప్రతి బ్యాంకు తమ కస్టమర్లకు సమాచారం అందిస్తాయని తెలిపింది.
ఏప్రిల్ 18న ఆర్టీజీఎస్ సాంకేతిక వ్యవస్థలోనూ రిజర్వ్ బ్యాంక్ టెక్నికల్ అప్‌గ్రేడ్ చేసింది. 2019 డిసెంబరు నుంచి నెఫ్ట్ సేవలను 24×7 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి.