చైనాకు చెందిన టిక్ టాక్‌తో సహా మొత్తం 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో స్వదేశీ యాప్ మిట్రాన్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. గత 24 గంటల్లోనే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 11 రెట్లు పెరిగినట్టు మిట్రాన్ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ యాప్‌ను దేశంలో 17 మిలియన్ (1.7 కోట్ల) వినియోగదారులు డౌన్‌లోడ్ చేసినట్లు ప్రకటించింది. అలాగే, గత రెండు నెలల్లోనూ భారతదేశంలో అత్యధికంగా ప్రజలు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్ కూడా ఇదేనట.
'భారతీయ వినియోగదారులు మిట్రాన్‌ను వేగంగా స్వీకరించడం ఆనందంగా ఉంది. చైనా యాప్‌ల నిషేధం తర్వాత మా అంచనాలకు మించి డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 11రెట్లు పెరిగింది' అని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శివాంక్ అగర్వాల్ పేర్కొన్నాడు.
'మేం దృఢమైన బ్యాకెండ్ మౌలిక సదుపాయాలను నిర్మించాం. మా ప్లాట్‌ఫాం ఇప్పుడు పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. అందుకే గణనీయంగా డౌన్‌లోడ్లు పెరుగుతున్నాయి' అని మరో ఫౌండర్ అనిశ్ ఖండేల్వాల్ వ్యాఖ్యానించారు.