Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో కస్టమర్లకు శుభవార్త : 2017 మార్చి వరకు ఉచిత ఆఫర్..

రిలయన్స్ జియో సిమ్ వినియోగదారులకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని శుభవార్త అందించారు. గురువారం ముంబైలో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులు వచ్చే ఏడాది మార్

Advertiesment
Jio customers
, గురువారం, 1 డిశెంబరు 2016 (14:06 IST)
రిలయన్స్ జియో సిమ్ వినియోగదారులకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని శుభవార్త అందించారు. గురువారం ముంబైలో నిర్వ‌హించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులు వచ్చే ఏడాది మార్చి 31 వరకు సేవలు ఉచితంగా ల‌భిస్తాయ‌ని ప్ర‌క‌టించారు. అదేసమయంలో నెంబరు పోర్టబులిటీని స్వీకరించేందుకు జియో సిద్ధంగా ఉందని తెలిపారు. 
 
ఈ నెల 31 నుంచి దేశంలోని 100 న‌గ‌రాల్లో వినియోగ‌దారులు ఆర్డ‌ర్ చేసుకుంటే ఇంటి వ‌ద్ద‌కే జియో సిమ్‌ను పంపే సౌల‌భ్యాన్ని తీసుకొస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 5 కోట్ల మంది జియో సిమ్‌ను తీసుకున్నార‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తంచేశారు. జియో నంబర్లకు వచ్చే కాల్స్‌ను ఇతర నెట్‌వర్క్ ఆపరేట్లు బ్లాక్ చేస్తున్నారనీ, ఇలా మొత్తం 900 కోట్ల కాల్స్‌ను బ్లాక్ చేసినట్టు ఆయన తెలిపారు. 

ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ కంటే అత్యంత వేగంగా జియో వృద్ధి చెందుతోందన్నారు. అలాగే, అత్యంత సాంకేతికతను అందించే సంస్థ జియో అని తెలిపారు. జియోతో ప్రతిరోజు 6 లక్షల మంది వినియోగదారులు అనుసంధానం కావడం సంతోషమన్నారు. ఇతర నెట్‌వర్క్‌లతో పోల్చితే జియో 25 రెట్లు అధిక వేగమని తెలిపారు. తమను నమ్మిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
సలహాలు, సూచనలు స్వీకరించేందుకు లాంచింగ్ ఆఫర్ ఇచ్చామన్నారు. జియో అంత్యంత వేగంగా 5 కోట్ల వినియోగదారులన సంఖ్యను అధిగమించిందన్నారు. జియో వినియోగదారులకు ఇరత నెట్‌వర్క్‌లు సహకరించడంలేదని తెలిపారు. జియో సర్వీసులో మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ తీసుకు రమ్మన్నామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెట్రోల్ బంకుల్లో పాత నోట్ల మార్పిడి గడువును కుదించిన కేంద్రం