Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్ అదుర్స్.. సత్య నాదెళ్లకు భారీ ఇంక్రిమెంట్

మైక్రోసాఫ్ట్ క్యాపిటలైజేషన్ అదుర్స్.. సత్య నాదెళ్లకు భారీ ఇంక్రిమెంట్
, శుక్రవారం, 18 అక్టోబరు 2019 (11:52 IST)
మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల ఒక ట్రిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఇందుకు కారణం తెలుగువాడైన సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టడమేనని తెలుస్తోంది. ఆయన సీఈవో అయినప్పటి నుంచి ఆ సంస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతూ.. లాభాలను ఆర్జిస్తోంది.

ఈ నేపథ్యంలో సత్య నాదెళ్లకు భారీగా ఇంక్రిమెంట్ లభించింది. ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ ఏడాది ఏకంగా 66 శాతం ఇంక్రిమెంట్ లభించింది. 
 
మైక్రోసాఫ్ట్ వార్షిక నివేదికను అనుసరించి 2018-19 సంవత్సరానికి సత్య నాదెళ్లకు 42.9 మిలియన్ డాలర్ల వేతనం లభించింది. గడిచిన రెండేళ్లలో ఆయన వేతనం రెండింతలైనట్లు తెలుస్తోంది. 2016-17కు గానూ ఆయన 20 మిలియన్ డాలర్ల వార్షిక వేతనం అందుకోగా.. 2017-18కి 25 మిలియన్ డాలర్లు అందుకున్నారు. 
 
సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరుణంలో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 302 బిలియన్ డాలర్లు ప్రస్తుతం 850 మిలియన్ డాలర్లకు చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌గా శరద్ అర్వింద్ బాబ్డే.. సిఫార్సు చేసిన సీజేఐ