Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ఇక గూగుల్ క్రోమ్‌లో డుయో కాలింగ్ సౌకర్యం.. ఒకేసారి 12మందితో..?

Advertiesment
Google
, శనివారం, 9 మే 2020 (11:33 IST)
Google
డుయో గ్రూప్ కాలింగ్ సౌకర్యం ఇక గూగుల్ క్రోమ్‌లో రానుంది. తక్కువ బ్యాండ్‌విడ్త్ కనెక్షన్‌లో కూడా నాణ్యమైన, క్లారిటితో కూడిన వీడియో కాల్ సదుపాయం కల్పించడానికి సర్చ్ ఇంజన్ దిగ్గజం కొత్త వీడియో కోడెక్ టెక్నాలజీని రూపొందించింది. వీడియో కాలింగ్ సమయంలో ఫోటోను క్లిక్ చేయడానికి వినియోదారులకు అవకాశం ఉంటుంది. 
 
ఒకేసారి 12 మంది వినియోగదారులు గూగుల్ వీడియో కాల్‌లో పాల్గొనవచ్చు. 24 గంటల తరువాత మీకు వచ్చిన వీడియో, వాయిస్ మెసేజ్‌లు ఆటో సేవ్ అయ్యేలా ఫ్యూచర్‌ను కల్పిస్తుంది. ప్రతి ఏడు రోజుల్లో 10 మిలియన్లు పైగా కొత్త వ్యక్తులు డుయో కోసం సైన్ అప్ చేస్తున్నారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
 
ఇప్పటివరకు స్మార్ట్ ఫోనులో వుండిన ఈ సౌకర్యం.. కరోనా వైరస్ కారణంగా దూరం దూరంగా వుంటున్న కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులకు అందుబాటులో వుండేలా.. గూగుల్ డుయోలో తాజా ఫీచర్లపై గూగుల్ ఇప్పటికే ప్రకటించింది. వారం రోజుల్లో క్రోమ్‌లో దీనికి సంబంధించిన ప్రివ్యూ ప్రారంభం కానుంది. 
 
కొత్త లేఅవుట్‌తో పాటు వెబ్‌లో డుయో గ్రూప్‌కాంలింగ్ అందుబాటులోకి వస్తుంది. ఎక్కువమంది గ్రూప్ కాలింగ్‌కు డుయో గ్రూప్ కాలింగ్ ఉపయోగపడుతుంది. గూగుల్ అకౌంట్ ఉన్నవారు ఎవరైనా స్పేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు పంపిన లింక్ ద్వారా గ్రూప్ కాల్‌లో చేరవచ్చు. గూగుల్ డ్యూయో గ్రూప్ కాలింగ్‌ నడుస్తున్నప్పుడు హ్యాంగ్ అవుతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

365 రోజులకు రోజూ 2జీబీ డేటా.. జియో ''వర్క్ ఫ్రమ్ హోమ్'' ప్లాన్