Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 14 January 2025
webdunia

టిక్ టాక్‌తో అమెరికాకు విఘాతం తప్పదు.. ఫేస్‌బుక్ సీఈవో

Advertiesment
టిక్ టాక్‌తో అమెరికాకు విఘాతం తప్పదు.. ఫేస్‌బుక్ సీఈవో
, మంగళవారం, 25 ఆగస్టు 2020 (16:10 IST)
Zukerburg
టిక్ టాక్ వల్ల అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి విఘాతం కలుగవచ్చునని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా భద్రతకు టిక్ టాక్ ప్రమాదకరం కాగలదన్న ట్రంప్ సర్కార్ ఆరోపణలను ఆయన సమర్థించారు. చైనా యాప్‌లపై పలు దేశాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. డ్రాగన్ కంట్రీకి సంబంధించిన పలు యాప్‌లను భారత్ ఒక్కసారిగా నిషేధించడం ప్రపంచ వ్యాప్తంగా ఒక సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది.
 
భారత్ నిర్ణయంతో ఆ దేశానికి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కుదేలైపోయింది. అమెరికా సైతం ఈ యాప్‌ను నిషేధించాలని నిర్ణయించింది. యూఎస్ కంపెనీ కింద ఈ సంస్థ ఉంటే సమస్య లేదని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, అమెరికాలో దీన్ని సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు ప్రారంభించింది.
 
ఇలాంటి సమయంలో జుకర్ బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు చెందిన సోషల్ మీడియా సంస్థలు చాలా ప్రమాదకరమని... వాటి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మరోవైపు, టిక్ టాక్‌ను నిషేధిస్తామన్న ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తామని టిక్ టాక్ ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో రామ్ ఇకనైనా జాగ్రత్తపడితే మంచిది: మంత్రి కొడాలి నాని హెచ్చరిక