Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డోనాల్డ్ ట్రంప్‌ను కోర్టుకీడుద్దాం... యుఎస్ టెక్ దిగ్గజాల నిర్ణయం

ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్పై టెక్ దిగ్గజాలు న్యాయపోరాటం చేయాలని నిర్ణయించాయి. ట్రంప్ ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తూ వేయబోయే దావాకు

Advertiesment
డోనాల్డ్ ట్రంప్‌ను కోర్టుకీడుద్దాం... యుఎస్ టెక్ దిగ్గజాల నిర్ణయం
, మంగళవారం, 31 జనవరి 2017 (13:50 IST)
ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆర్డర్పై టెక్ దిగ్గజాలు న్యాయపోరాటం చేయాలని నిర్ణయించాయి. ట్రంప్ ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తూ వేయబోయే దావాకు సపోర్టుగా అమికస్ బ్రీఫ్స్ను ఫైల్ చేయడానికి గ్రూఫ్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీలు కీలక సమావేశం నిర్వహించనున్నాయి. 
 
ఈసమావేశంలో దావాకు మద్దతుగా సమర్పించబోయే ఈ లీగల్ డాక్యుమెంట్పై చర్చించనున్నాయి. ఈ విషయాన్ని మీటింగ్ నిర్వహించబోయే కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ రూపొందించే గిట్ హబ్ ఈ మీటింగ్కు టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్,  ఎయిర్బీఎన్బీ ఇంక్, నెట్ఫ్లిక్స్ ఇంక్ వంటి కంపెనీలకు ఆహ్వానాలు పంపినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే దీనిపై గూగుల్, నెట్ఫ్లిక్స్ అధికారులు ఇంకా స్పందించలేదు. 
 
గతవారం ట్రంప్ జారీచేసిన ట్రావెల్ బ్యాన్పై టెక్నాలజీ సెక్టార్ చాలా ఆగ్రహంగా ఉంది. ఏడు దేశాలపై నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న టెక్ దిగ్గజాలు, ఇతర దేశాల్లో ఉన్న తమ ఇమ్మిగ్రేట్లను వెనక్కి రప్పించడానికి కంపెనీలు ఫైనాన్సియల్ సపోర్టును అందిస్తున్నాయి. ట్రంప్ ఆర్డర్ తమ బిజినెస్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయని ఇప్పటికే అమెజాన్.కామ్, ఎక్స్పీడియా ఇంక్ వంటి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన గూగుల్ ఉద్యోగులు.. నిరసన కార్యక్రమంలో సుందర్ పిచాయ్ కూడా...