Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇపుడు.. 5జీ స్మార్ట్ ఫోన్‌ వచ్చేసిందోచ్...!

2జీ, 3జీ, 4జీ ఇక తర్వాత తరం 5జీ (ఫిప్త్ జనరేషన్). ఇంకా పూర్తిగా 4జీ సేవలనే ఖచ్చితత్వంతో పొందలేకపోతున్న పరిస్థితి. అప్పుడే మరో తరం వచ్చేసింది. ప్రపంచంలోనే తొలిసారి 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించేశారు.

ఇపుడు.. 5జీ స్మార్ట్ ఫోన్‌ వచ్చేసిందోచ్...!
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:57 IST)
2జీ, 3జీ, 4జీ ఇక తర్వాత తరం 5జీ (ఫిప్త్ జనరేషన్). ఇంకా పూర్తిగా 4జీ సేవలనే ఖచ్చితత్వంతో పొందలేకపోతున్న పరిస్థితి. అప్పుడే మరో తరం వచ్చేసింది. ప్రపంచంలోనే తొలిసారి 5జీ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించేశారు. ప్రముఖ చైనా కంపెనీ జడ్‌టీఈ అనే కంపెనీ గిగాబిట్ ఫోన్ పేరుతో ఈ నూతన ఫోన్‌ను విడుదల చేశారట. ఈ స్మార్ట్ ఫోన్‌తో సెకనుకు 1జిబీ వేగంతో డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చుట. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 4జీ కన్నా 10 రెట్లు వేగంగా పనిచేస్తుందట. 
 
స్పెయిన్ రాజధాని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ 2017లో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఫెయిర్, వాణిజ్యపరంగా ఈ సాంకేతికత 2020లోగా అందుబాటులోకి రానున్నట్లు జడ్ టీ ఈ సంస్థ పేర్కొంది. భవిష్యత్‌లో సెకన్లలోనే పూర్తి నిడివి గల సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని కూడా తెలిపింది. అంతేకాకుండా అత్యంత వేగంగా ఇంటర్నెట్‌లోని సినిమాలను చూసేందుకు ఫోన్లలోనే టీవీ ప్రసారాలు వీక్షించేందుకు వీలుకానుందట. 
 
మరోవైపు దక్షిణ కొరియా సంస్థ కేటీ కార్స్ 2018 వింటర్ ఒలింపిక్స్ 5జీ సేవలను ప్రయోగాత్మకంగా అందించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నెలల క్రితమే వినియోగదారులందరికీ దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టెలికాం సంస్థలన్నీ 4జీ నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకొచ్చాయి. అందులోనూ రిలయెన్స్ జియో సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ కొత్త సాంకేతికతను ముందుగా ఏ సంస్థ భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారుల ఆదరణను పొందుతుందో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రక్ డ్రైవర్ వద్ద దారి అడిగిన పైలట్.. వీడియో చూడండి