Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వోల్ట్ టెక్నాలజీతో వస్తోన్న బీఎస్ఎన్ఎల్: జియోకు సవాలేనా? (video)

Advertiesment
వోల్ట్ టెక్నాలజీతో వస్తోన్న బీఎస్ఎన్ఎల్: జియోకు సవాలేనా? (video)
, గురువారం, 17 అక్టోబరు 2019 (16:03 IST)
ప్రభుత్వ టెలికాం రంగం బీఎస్ఎన్ఎల్ సంస్థ ఇతర ప్రైవేట్ టెలికాం రంగ సంస్థలతో పోటీ పడలేక నానా తంటాలు పడుతోంది. బీఎస్ఎన్ఎల్ సంస్థకు చెందిన 60శాతం పైబడిన ఆదాయం ఆ సంస్థలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకే ఖర్చవుతోంది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడం.. కొందరిని ఉద్యోగాల నుంచి తీసేయడం వంటి పనులు చేసేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సేవలపై విమర్శలు కూడా వస్తున్నాయి.  
 
ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్.. ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడనుంది. ఇందులో భాగంగా అధికారులు సర్వం సిద్ధం చేశారని.. త్వరలో బీఎస్ఎన్ఎల్ నుంచి 3జీ సేవలను 4జీ సేవలుగా మార్చనున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా అతివేగ ఇంటర్నెట్ కోసం వోల్ట్ టెక్నాలజీని బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టనుంది.  
 
3జీ సేవలను 4జీగా మార్చేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. వోల్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా అధిక డేటా ద్వారా వీడియో కాలింగ్, వాయిస్ కాల్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.

ఇంకా వోల్ట్ టెక్నాలజీని బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెడితే.. తప్పకుండా జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం సంస్థలకు పోటీగా నిలుస్తుందని.. బంపర్ ఆఫర్లను కూడా కస్టమర్లకు అందించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నాటకలో ఏడు తలల పాము కుబుసం .. వింతగా చూస్తున్న స్థానికులు