Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్.. నో డేటా.. 600 రోజులకు..?

Advertiesment
బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్.. నో డేటా.. 600 రోజులకు..?
, మంగళవారం, 26 మే 2020 (16:47 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తక్కువ మొత్తంలో డేటాను వాడుతూ అధికంగా ఫోన్ కాల్స్ చేసే వినియోగదారుల కోసం ఏకంగా 600 రోజుల చెల్లుబాటు కాలంతో కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందించే అనేక ప్లాన్లు ఈ కొత్త ప్లాన్ డేటాను వాడని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 
 
ఈ ప్లాన్ ధర రూ.2,399. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఇది రీఛార్జ్ చేసిన రోజు నుండి 600 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. టెలికామ్ మార్కెట్లో ఇతర ప్లాన్లు ఏవీ ఈ రకమైన యాక్సిస్‌తో ఇన్ని రోజుల వ్యాలిడిటీ లేకపోవడం బీఎస్ఎన్ఎల్‌కి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. కానీ ఈ ప్లాన్‌లో డేటా వాడుకోవడానికి అవకాశం లేదు.
 
ఈ ప్లాన్ మీకు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు, 60 రోజుల పాటు బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. కానీ డేటా ప్రయోజనం మాత్రం ఏదీ లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు.. వస్త్ర - చెప్పులు - గోల్డ్ షాపులకు ఓకే