Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపిల్‌తో పేటెంట్ వార్‌కు దిగిన నోకియా: 32కు పైగా పేటెంట్లను ఆపిల్ ఉల్లంఘించిందంటూ కేసు

టెక్ దిగ్గజం ఆపిల్‌కు, ఫీచర్ ఫోన్ల దిగ్గజం నోకియాల మధ్య మళ్లీ పేటెంట్ల వార్ మొదలైంది. అయితే నోకియా, ఆపిల్‌పై కేసు నమోదుచేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2009లోనే ఆపిల్ తమ పేటెంట్లను ఉల్లంఘించిందని నోకియా ఆర

Advertiesment
Apple and Nokia are fighting about patents again
, గురువారం, 22 డిశెంబరు 2016 (09:55 IST)
టెక్ దిగ్గజం ఆపిల్‌కు, ఫీచర్ ఫోన్ల దిగ్గజం నోకియాల మధ్య మళ్లీ పేటెంట్ల వార్ మొదలైంది. అయితే నోకియా, ఆపిల్‌పై కేసు నమోదుచేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2009లోనే ఆపిల్ తమ పేటెంట్లను ఉల్లంఘించిందని నోకియా ఆరోపించింది. దీనికి ఆపిల్ కూడా నోకియాపై కౌంటర్ ఫైల్ దాఖలు చేసింది. 2011లో ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదరడంతో ఆ పేటెంట్ వార్ ముగిసింది. 2011 అ‍్రగిమెంట్ నుంచి ఆపిల్ తమకు చెందిన పలు పేటెంట్ హక్కులను ఉల్లంఘిస్తుందని నోకియా మరోసారి ఆరోపణలకు దిగింది.
 
తాజాగా మరోసారి పేటెంట్ల యుద్ధం తెరపైకి వచ్చింది. కంపెనీకి చెందిన పలు పేటెంట్లను ఆపిల్ దొంగతనం చేసిందని ఆరోపణలతో అమెరికా, జర్మనీలో ఆ కంపెనీపై పలు ఫిర్యాదులు దాఖలు చేసినట్టు నోకియా ప్రకటించింది. టాబ్లెట్స్, మొబైల్ ఫోన్స్, పర్సనల్ కంప్యూటర్ల వంటి పలు కన్సూమర్ ఎలక్ట్రానిక్స్‌లో మూడు విలువైన పేటెంట్ పోర్ట్ ఫోలియోను తాము కలిగి ఉన్నామని నోకియా పేర్కొంది. 
 
అయితే వాటికి సంబంధించిన 32కు పైగా పేటెంట్లను ఆపిల్ ఉల్లంఘించిందని నోకియా వాదిస్తోంది. 20 ఏళ్ల తమ ఇండస్ట్రీలో సుమారు రూ.8 లక్షల కోట్లను పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టినట్టు నోకియా పేర్కొంది. తమ పరిశోధన, అభివృద్ధిలో సృష్టించిన పలు ఫండమెంటల్ టెక్నాలజీస్‌ను ప్రస్తుతం చాలా మొబైల్ డివైజ్‌లు వాడుతున్నాయని నోకియా ఆరోపిస్తోంది. దీనిలో ఆపిల్ కూడా ఉన్నట్టు పేర్కొంది.
 
తమ పేటెంట్లను వాడుకుంటున్నందుకు ఓ ఒప్పందం కుదుర్చుకోవడానికి ఆపిల్‌తో చాలాసార్లు చర్చలు జరిపామని, కానీ ప్రస్తుతం తమ హక్కులు వాడుకుంటున్నందుకు చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని నోకియా పేటెంట్ బిజినెస్ హెడ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త సంవత్సరం నుంచి హైదరాబాదులో ప్రకటనలు, హోర్డింగ్‌లు, కటౌట్లుండవ్