త్వరలోనే ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను తీసుకురానున్నట్టు గూగుల్ దిగ్గజం వెల్లడించింది. బహుశా ఆండ్రాయిడ్-14లో ఈ అత్యాధునిక ఫీచర్ అందుబాటులోకి వస్తుందని టాక్ వస్తోంది. దీనిపై ఆండ్రాయిడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు హిరోషి లోషిమెర్ స్పందించారు.
ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, నెట్వర్క్ అందుబాటులో లేకపోయినా, నేరుగా శాటిలైట్‌తో అనుసంధానమై ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఎస్సెమ్మెస్‌లు కూడా ఇలానే పంపుకునే వీలుంటుంది.