Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చాంపియన్లు అలాంటి క్షణాల్లోనే పుడతారు.. ఘోర ఓటమిని గెలుపుగా మార్చిన పొలార్డ్

ప్రత్యర్థి నడ్డి విరగ్గొట్టిన అనూహ్య క్షణాల్లో కూడా మనో నిబ్బరం కోల్పోకుండా ఆడి ఓటమి పెను కోరలనుంచి జట్టును బయటకు లాగి వన్‌మ్యాన్ షిప్ లాంటి అద్భుత ప్రదర్శన చేస్తే ఆ మేటి విజయం పేరు కీరోన్ పొలార్డ్. ఐపీఎల్-10 సీజన్‌లో శుక్రవారం రెండు మదగజాల మధ్య జరి

Advertiesment
IPL-10
హైదరాబాద్ , శనివారం, 15 ఏప్రియల్ 2017 (03:20 IST)
ప్రత్యర్థి నడ్డి విరగ్గొట్టిన అనూహ్య క్షణాల్లో కూడా మనో నిబ్బరం కోల్పోకుండా ఆడి ఓటమి పెను కోరలనుంచి జట్టును బయటకు లాగి వన్‌మ్యాన్ షిప్ లాంటి అద్భుత ప్రదర్శన చేస్తే ఆ మేటి విజయం పేరు కీరోన్ పొలార్డ్. ఐపీఎల్-10 సీజన్‌లో శుక్రవారం రెండు మదగజాల మధ్య  జరిగిన హోరాహోరీపోరులో గెలిచింది జట్టు కాదు....  ప్రశాంత సముద్రంలో పెనుతుపాన్ లాంటి పొలార్డ్ మనో నిబ్బరం గెలిపించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లు ఏడు పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టిన భయకంపిత క్షణాల్లో ఏటికి ఎదురొ్డ్డి తాబేటి నత్తనడకతో వికెట్‌ను కాచుకుని చివరి అయిదు ఓవర్లలో కొదమసింహంలా జూలు జులిపి జట్టుకు అద్వితీయ విజయం సాధించిపెట్టిన పొలార్డ్ తనపై సచిన్ పెట్టుకున్న నమ్మకానికి నూటికి నూరుపాళ్లూ న్యాయం చేశాడు.
 
ఐపీఎల్‌ టోర్నీలోనే తీవ్రమైన పోటీ జరిగే అరుదైన జట్లు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు. ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఐపీఎల్‌లో మైదానంలోనే యుద్దాలు జరిగేవి. మైదానంలో వాదులాటకు గాను అంపైర్ హెచ్చరికకు గురైన ఘటనలో తన బ్యాటును బౌలర్ మిచెల్ స్టార్క్‌ వైపు విసిరేసి, నిరసనగా నోటికి అడ్డంగా టేప్ చుట్టుకున్న పొలార్డ్‌ను గతంలో చూశాం. 
 
ప్రత్యర్థి విధించిన 142 పరుగులు స్వల్ప స్కోరును సులభంగా అధిగమించవచ్చని ముంబై ఇండియన్స్ జట్టు  పెట్టుకున్న నమ్మకం కళ్లముందే చెదిరిపోయి టపటపా నాలుగు వికెట్లు కూలిపోయినప్పుడు పొలార్డ్ ఆవేశంతో ఊగిపోయాడు. కానీ ఆ తర్వాత అతడు చూపిన నిబ్బరం, సంయమనం మర్చిపోలేనిది. 
మైదానంలోకి  పొలార్డ్ అడుగు పెట్టిన సమయానికి ముంబై ఇండియన్స్ జట్టు స్కోరు 7 పరుగులకు 4 వికెట్లు. తొలి రెండు ఓవర్లలో జరిగిన ఈ విధ్వంసం జట్టును వణికించిన తరుణంలో బరిలోకి దిగిన పొలార్డ్ పరిస్థితులకు అనుగుణంగా అసాధారణమైన ప్రశాంతతను, నిబ్బరాన్ని ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్‌కి వరుసగా మూడో విజయం కట్టబెట్టిన మ్యాచ్ విన్నింగ్ హాప్ సెంచరీ సాధించిన క్రమంలో అనితర సాధ్యమైన నిబ్బరం ప్రదర్సించాడు పొలార్డ్. 
 
గత ఐపీఎల్‌లో పొలార్డ్ గరిష్టంగా ఎదుర్కొన్న బంతుల సంఖ్య 40 మాత్రమే. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కూడా వికెట్లు పేకమేడల్లా కూలిపోయిన నేపథ్యంలో పరుగులే చేయకుండా బంతిని అడ్డుకున్న పొలార్డ్‌ను చూసి ప్రేక్షకులు విసుక్కోవడం ప్రారంభించారు. ఆ సమయంలో మెల్లగా విశ్వాసం పెంచుకున్నాడు. రన్ రేట్ ఓవర్‌కి పది పరుగులు సాధించాలని చెబుతోంది. క్రునాల్ పాండ్యా ఇచ్చిన మద్దతు బలంతో చెలరేగిపోయాడు పొలార్డ్. ఆ దన్నుతోనే చివరి 5 ఓవర్లలో స్పిన్నర్ల  బౌలింగ్‌ను ఆడుకున్నాడు. 
 
అత్యంత ఉద్రిక్తంగా మారిన చివరి అయిదు ఓవర్లలో 52 పరుగులు చేయవలసిన స్థితిలో పరుస సిక్సులతో చెలరేగిపోయాడు పొలార్డ్. 16వ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో, పోర్లతో చెలరేగిన పొలార్డ్ ఓవర్ ముగిసేసరికి లక్ష్యాన్ని 33 పరుగులకు తగ్గించేశాడు. చివరి ఓవర్లో 11.16 శాతం స్కోరు సాధించాడు. క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్, ఏబీ డివీలర్స్ మాత్రమే గతంలో ఈ ఫీట్ సాధించారు.
 
చాంపియన్లు అత్యంత సంక్లిష్టమైన పరిస్థితుల్లోనే పుట్టుకొస్తారన్నది పదే పదే నిరూపించబడిది. శుక్రవారం అలాంటి రియల్ ఛాంపియన్‌‌గా పొలార్డ్ అవతరించాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒకే రోజు రెండో హ్యాట్రిక్: పుల్ జోష్‌లో ఐపీఎల్-10