Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గ్రహాంతరవాసిని తలపించిన భీకర ఫామ్‌లో స్టీవ్ స్మిత్: బెంబేలెత్తిన బౌలర్లు

ఒకవైపు భీకరమైన ఫామం, మరోవైపు మరొక గ్రహం నుంచి వచ్చాడా అని ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయేలా చేసే బ్యాటింగ్ విన్యాసం.. సమకాలీన క్రికెట్‌లో విరాటో కోహ్లీకి నిజమైన ప్రత్యర్థిలా స్వీవ్ స్మిత్ కనిపిస్తున్నాడు.

గ్రహాంతరవాసిని తలపించిన భీకర ఫామ్‌లో స్టీవ్ స్మిత్: బెంబేలెత్తిన బౌలర్లు
హైదరాబాద్ , శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (03:35 IST)
ఒకవైపు భీకరమైన ఫామం, మరోవైపు మరొక గ్రహం నుంచి వచ్చాడా అని ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయేలా చేసే బ్యాటింగ్ విన్యాసం.. సమకాలీన క్రికెట్‌లో విరాటో కోహ్లీకి నిజమైన ప్రత్యర్థిలా స్వీవ్ స్మిత్ కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా గత నెలలో భారత జట్టుపై అంచనాలకు మించి అటను ప్రదర్శించిన స్మిత్  భారత్‌నుంచి గవాస్కర్, బోర్డర్ ట్రోఫీనీ లాగేసుకున్నట్లే కనిపించాడు. ఇప్పుడు ఐపీఎల్ 10 సీజన్‌లోనూ అదే పామ్. భీకర అనే పదానికి భయం పుట్టే ఫామ్. బౌలర్ ఎవరైనా సరే ఉతికి ఆరేసే ఫామ్. ముంబై ఇండియన్స్‌ జట్టులో భాగమైన ఇద్దరు న్యూజిలాండ్ బౌలర్లు, ఒక వెస్టిండీస్ బౌలర్, ముగ్గురు ఇండియన్ బౌలర్లను కిలిపి చితక్కొట్టాడు.
 
ఐపీఎల్ 10 సీజన్‌లో రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్ బౌలర్లను చితకబాదిన స్మిత్ 54 బంతుల్లో 84 పరుగులు తీసి రైజింగ్ పుణె జట్టుకు శుభారంభం అందించాడు. బలమైన జట్టుతో కష్టసాధ్యమైనట్లు కనిపిస్తున్న భారీ స్కోరుతో 185 పరుగులు విజయ లక్ష్యం తన కళ్ల ముందు కనబడుతున్నా మొక్కవోని స్థైర్యంతో చేజింగ్ ప్రారంభించిన స్మిత రహానే తోడుగా ఒంటి చేత్తో విజయం సాధించిపెట్టాడు. 
 
తొలి 26 బంతుల్లో 28 పరుగులు చేసిన స్మిత్ తర్వాతి 28 బంతుల్లో ఏకంగా 56 పరుగులు కొల్లగొట్టి ముంబై ఇండియన్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్లో బంతులు తగ్గుతున్న క్షణంలో పొలార్డ్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది జట్టును గెలిపించిన తీరు అనితర సాధ్యమనే చెప్పాలి. అతడిని ఎలా ఔట్ చేయాలో తెలియక ముంబై ఇండియన్ బౌలర్లు చేష్ట్యలుడిగి పోయారంటే స్మిత్ చివరి ఓవర్లలో ఎంత చెలరేగిపోయాడో అర్థం అవుతుంది. చివరి ఓవర్లో అతడు జట్టును గెలిపిస్తున్న క్షణం స్టేడియం ఊపిరి పీల్చుకోవడం ఆగిపోయిందంటే అతిశయోక్తి కాదు. 
 
నిస్సందేహంగా ఐపీఎల్ 10 సీజన్‌లో పరుగు వీరుల్లో అగ్రగాముల్లో స్మిత్ తొలి వరుసలోని నిలబడే నిఖార్సయిన బ్యాట్స్‍‌మన్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆల్‌రౌండర్ పదానికి అర్థం చెప్పిన హార్దిక్ పాండ్య: చివరి ఓవర్లో వీర విహారం