Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరదాగా రివ్యూ కోరిన ధోనీ.. పకపక నవ్విన అంపైర్

కెరీర్ తొలినాళ్లనుంచి తనలో కొనసాగుతున్న ఆ సరదా మాత్రం తనకు దూరం కాలేదు. ఇప్పటికీ కెప్టెన్‌గానే మైదానంలో స్పందిస్తున్న ధోనీ మేనరిజమ్స్ ప్రేక్షకులనే కాదు ఫీల్డ్ లోని అంపైర్లను కూడా కడుపుబ్ప నవ్విస్తూనే ఉన్నాయి.

Advertiesment
సరదాగా రివ్యూ కోరిన ధోనీ.. పకపక నవ్విన అంపైర్
హైదరాబాద్ , శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (04:24 IST)
పదేళ్లు భారత క్రికెట్ జట్టు విజయ పరంపరను తన భుజస్కంధాలపై మోసిన అరుదైన కెప్టెన్ ధోనీ, క్రికెట్ లోని ఉత్తాన పతనాలను చవిచూస్తున్న పరిణత ఆటగాడు ధోనీ, ఒక మెరుపు నిర్ణయంతో అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో కెప్టెన్‌‌షిప్‌ను తృణప్రాయంగా వదులుకున్న స్ఫూర్తిదాయక క్రీడాకారుడు ధోనీ, ఇప్పుడు వన్డే క్రికెట్‌లో, ఐపీఎల్‌లో అతడు కెప్టెన్ షిప్ లేని అరుదైన అటగాడు. జట్టు భారం మోసే బాధ్యతలను తప్పించుకున్నా కెరీర్ తొలినాళ్లనుంచి తనలో కొనసాగుతున్న ఆ సరదా మాత్రం తనకు దూరం కాలేదు. ఇప్పటికీ కెప్టెన్‌గానే మైదానంలో స్పందిస్తున్న ధోనీ మేనరిజమ్స్ ప్రేక్షకులనే కాదు ఫీల్డ్ లోని అంపైర్లను కూడా కడుపుబ్ప నవ్విస్తూనే ఉన్నాయి. 
 
ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ తో  మూడో వన్డేల సిరీస్ లో భాగంగా పుణెలో జరిగిన తొలి వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొందర్లో రివ్యూకు వెళ్లడం అందరికీ తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాడిగా ఉన్న ధోని పొరపాటున డీఆర్ఎస్ సంకేతాలిచ్చాడు. అంపైర్ నిర్ణయంపై సమీక్ష కోసం కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అప్పీల్ చేయవలసిన సమయంలో ప్లేయర్ ధోని రివ్యూకు వెళ్లాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఆడిన తొలి మ్యాచ్ కాబట్టి ధోని అలా తానే స్థానంలో ఉన్నదీ మరచిపోయి కోహ్లీని బైపాస్ చేసి అలా రివ్యూకు వెళ్లాడు. ఆ రివ్యూ సత్ఫలితాన్ని ఇచ్చిందనేది వేరే విషయం. కానీ కోహ్లీ కూడా ధోనీ స్పందనను స్పోర్టివ్‌గానే తీసుకున్నాడు.
 
అయితే ఇదే స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ధోని సరదాగా మళ్లీ రివ్యూ కోసం వెళ్లాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా  పుణె జట్టు లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ వేసిన బౌలింగ్ లో ధోని రివ్యూ కోరాడు. పొలార్డ్ అవుట్ విషయంలో ధోని రివ్యూ కావాలంటూ సైగ చేశాడు. ఐపీఎల్‌లో రివ్యూలు లేకపోయినా థర్డ్ అంపైర్ అంటూ సంకేతాలిచ్చాడు ధోని. తాహీర్ అప్పీల్‌కు అంపైర్ స్పందించకపోవడంతో ధోని ఇలా చేసి నవ్వులు పూయించాడు.  కాగా, టీవీ రిప్లేలో అది అవుట్ గా కనబడినప్పటికీ ఐపీఎల్లో డీఆర్ఎస్ లేకపోవడంతో పొలార్డ్ బతికిపోయాడు.
 
ధోనీలోని ఆ  సరదాతనం, ఆ హాస్యప్రవత్తి అతడి కెరీర్ చరమాంకం వరకు అలాగే కొనసాగాలని కోరుకుందామా..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ ప్రాంచైజీల గూబ గుయ్‌మనిపించిన ఆ భీకర బౌలర్: కసి అంటే అదీ..