Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2020: చెన్నైతో రైనా, భజ్జీల అనుబంధం కట్..

Advertiesment
ఐపీఎల్ 2020: చెన్నైతో రైనా, భజ్జీల అనుబంధం కట్..
, శుక్రవారం, 2 అక్టోబరు 2020 (11:20 IST)
ఐపీఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో సురేశ్‌ రైనా, హర్భజన్‌ సింగ్‌ అనుబంధానికి శాశ్వతంగా తెరపడినట్టే కనిపిస్తోంది. వారిద్దరు మున్ముందు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వారిద్దరి పేర్లను తొలగించిన ఆ ఫ్రాంచైజీ వారితో ఒప్పందాలనూ రద్దు చేసుకొనే ప్రక్రియను ఆరంభించిందని సమాచారం. నిబంధనల ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు లీగ్‌ వర్గాలు అంటున్నాయి.
 
2018 వేలం మార్గదర్శకాల ప్రకారం రైనా, భజ్జీతో చెన్నై మూడేళ్ల కాలానికి ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రకారం 2020 సీజన్‌తో ఒప్పంద గడువు ముగుస్తుంది. వ్యక్తిగత కారణాలతో వారిద్దరూ ఈ ఏడాది లీగ్‌ ఆడేందుకు నిరాకరించారు. దాంతో నిబంధనల ప్రకారం అధికారికంగా వారితో ఒప్పందాలు రద్దు చేసుకొనేందుకు యాజమాన్యం ప్రక్రియ మొదలుపెట్టిందని తెలిసింది. 
 
ఏడాదికి రూ.11 కోట్లకు రైనా, రూ.2 కోట్లకు భజ్జీతో ఎన్‌. శ్రీనివాసన్‌ నేతృత్వంలోని ఫ్రాంచైజీ ఒప్పందాలు చేసుకుంది. ఈ సీజన్‌లో ఆడటం లేదు కాబట్టి అందులో కొంత డబ్బునూ చెల్లించడం లేదని లేదని సమాచారం. 
webdunia
csk bhajji
 
కాగా నవంబర్‌ 10తో ఈ సీజన్‌ ముగుస్తుంది. మళ్లీ 2021, ఏప్రిల్‌లోనే 14వ సీజన్‌ ఆరంభం కానుంది. అప్పుడూ లీగ్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తుందో లేదో తెలియదు.

కరోనా ముప్ప నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్ల కోసం వేలం నిర్వహిస్తుందో లేదో స్పష్టత లేదు. ఈ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాదీ రైనా, భజ్జీని మైదానంలో చూడటం కష్టమేనని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యజువేంద్ర చాహల్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్..