Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 11- చెలరేగిన నరైన్.. 75 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్.. కేకేఆర్ విన్

ఐపీఎల్ పదకొండో సీజన్లో భాగంగా ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల రికార్డ

Advertiesment
IPL 2018
, ఆదివారం, 13 మే 2018 (11:01 IST)
ఐపీఎల్ పదకొండో సీజన్లో భాగంగా ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. ఓపెనర్లు సునీల్‌ నరైన్‌, క్రిస్‌ లిన్‌లు ఇన్నింగ్స్‌‌ను ధాటిగా ఆరంభించారు. తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత 27 పరుగులు చేసి లిన్‌ ఔటయ్యాడు.
 
అనంతరం నరైన్‌తో జతకట్టిన రాబిన్‌ ఉతప్ప.. ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా నరైన్‌ అద్భుతంగా రాణించాడు. 36 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 75 పరుగులతో అదుర్స్ అనిపించాడు. అలాగే రస్సెల్ 31 పరుగులు సాధించాడు. ఇక దినేష్ కార్తీక్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్థసెంచరీని పూర్తి చేశాడు. పంజాబ్  బౌలర్లలో ఆండ్రూ టై నాలుగు వికెట్లు సాధించగా, బరిందర్‌ శ్రాన్‌, మోహిత్‌ శర్మ తలో వికెట్‌ తీశారు.
 
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ పోరాడి ఓడింది. కోల్‌కతా నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి బంతి వరకూ పోరాటాన్ని కొనసాగించింది. చివరికి నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 214 పరుగులకు పరిమితమై 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 
 
కింగ్స్‌ ఎలెవన్ ఆటగాళ్లలో కేఎల్‌ రాహుల్‌ 66 పరుగులతో మరోసారి మెరిశాడు. ‌క్రిస్‌ గేల్‌ 21, అరోన్‌ ఫించ్‌ 34, అశ్విన్‌ 45 పరుగులు చేసినా లక్ష్యాన్ని చేధించలేకపోయారు. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్‌ మూడు వికెట్లు సాధించగా, నరైన్‌, ప్రసిధ్‌ కృష్ణ, కుల్దీప్‌ యాదవ్‌, సీర్లెస్‌లు తలో వికెట్‌ తీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ -11: సన్‌రైజర్స్‌దే అగ్రస్థానం.. రైనా, ఆండ్రూల రికార్డ్ అదుర్స్