Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిత్యతో కెమిస్ట్రీ కుదిరింది.. డేటింగ్ గురించి మాట్లాడను... దుల్కర్ ఇంటర్వ్యూ

Advertiesment
mammootty's son dulquar interview
, గురువారం, 23 ఏప్రియల్ 2015 (20:56 IST)
మనకు బాగా నచ్చినవారు, తెలిసినవారితో కలిసి సినిమా చేస్తే.. చాలా కంఫర్టబుల్‌గా వుంటుందని.. వర్ధమాన కథానాయకుడు దుల్కర్ అంటున్నాడు. మమ్ముట్టి తనయుడిగా తెలుగులో 'ఓకే బంగారం'తో పరిచయమయ్యాడు. దిల్‌రాజు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేశాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'ఓకే కన్మణి' తమిళంలోనూ, తెలుగులో ఓకే బంగారం ఒకేసారి విడుదలయ్యాయి. ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం గురువారంనాడు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు చిట్‌చాట్‌...
 
తమిళంలోనూ, తెలుగులో ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?
రెండుచోట్ల మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తమిళంలో ఇది నాకు రెండవ సినిమా, తెలుగులో నా ఫస్ట్‌ డబ్‌ సినిమా. రిలీజ్‌ అయిన ఫస్ట్‌ రోజు నుంచి చాలామంది తెలుగు వారు నా పెర్ఫార్మన్స్‌‌ని మెచ్చుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. 
 
మీ నటన గురించి రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్‌లు చేశారు..?
దాని గురించి నేను మాట్లాడను. నో కామెంట్‌...
 
మీ తండ్రిగారెలా ఫీలయ్యారు?
నాన్నగారు మణిరత్నం నుంచి ఇలాంటి సినిమా రావాలని ఆశిస్తుంటారు. ముఖ్యంగా మా ఫాదర్‌ కూడా మనసు పరంగా ఇంకా కుర్రాడే, ఆయన కుర్రాడిలానే అందరితో ఉంటారు. ఆయనకి సినిమా బాగా నచ్చింది.
 
మణిరత్నంను మీరు అప్రోచ్‌ అయ్యారా?
ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాం. ఆయనే నాకొక సబ్జెక్ట్‌ చెప్పారు. డ్రీమ్‌లా అనిపించింది. కథ కూడా వినకూడదనుకున్నా. కానీ అయన కూర్చోబెట్టి ఐడియా చెప్పి, ఆ తర్వాత ఫుల్‌ స్టొరీ నేరేట్‌ చేసారు.
 
మీనాన్నగారు తెలుగులో చేయలేదు. మీరు చేస్తారా?
ఇప్పుడే చెప్పలేను. ముందు భాష తెలియాలి. ఆ తర్వాత ఆలోచిస్తాను.
 
మణిరత్నంలో మీరు చూసిన ప్రత్యేకత ఏమిటి?
ప్రతిదీ ప్రత్యేకంగా వుంటుంది. కథ నడకతో పాటు పాటలు, మాటలు కూడా కథను నడిపిస్తాయి. ఇద్దరే నటులున్నా.. వారిని హైలైట్‌ చేయడానికి ప్రయత్నిస్తారు.
webdunia

 
నిత్యమీనన్‌తో ఇంతకుముందు నటించారు. ఎలా అనిపించింది?
రెండో సినిమాకి నిత్య మీనన్‌‌తో కలిసి పనిచేసాను. అప్పటికే నిత్యా చాలా సినిమాలు చేసింది, ప్రతిభ వున్న నటి. ఒకసారి మనకు బాగా తెలిసిన వారు మనతో కలిసి సినిమా చేస్తున్నారు అన్నప్పుడు మొదట కంఫర్టబుల్‌ ఉంటుంది. దానివల్లే కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అవుతుంది.
 
తెలుగు చిత్రాలు చూశారా?
వీలు దొరికినప్పుడల్లా చూస్తాను. మనం, మగధీర లాంటి సినిమాలు చూసాం. కొన్ని సినిమాలకు భాషా భేదం, లిమిట్స్‌ ఉండవు. 
 
తెలుగులో నచ్చిన హీరో?
తెలుగులో ప్రతి ఒక్క హీరోకి ఒక్కో స్టైల్‌ ఉంది. నాకు పర్సనల్‌‌గా పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు అంటే ఇష్టం. నన్ను నేను మెరుగు పరచుకోవడానికి ప్రతి స్టార్‌లోని కోణాల్ని పరిశీలిస్తాను అని చెప్పారు.
 
చివరిగా ఒక్క ప్రశ్న... డేటింగ్ గురించి...
అలాంటి వాటి గురించి నేనేమీ మాట్లాడలేను... నవ్వుతూ ముగించారు.

Share this Story:

Follow Webdunia telugu