Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు సినిమా అంటే.. లవ్‌, దెయ్యాల కథలేనా?: అర్థనారి దర్శకుడు భానుశంకర్ ఇంటర్వ్యూ

తెలుగులో మంచి సినిమాలు వస్తున్నా.. ఎక్కువ శాతం ప్రేమకథలు, దెయ్యం, భూతం వంటి కథలే వస్తున్నాయి. అవి తప్పితే ప్రేక్షకులకు దేశభక్తితో కూడిన కథలతో సినిమాలు చేయలేమా? చేస్తే.. పెద్ద హీరోలతోచేయాలా? కొత్త హీర

Advertiesment
Ardhanaari movie
, గురువారం, 30 జూన్ 2016 (19:17 IST)
తెలుగులో మంచి సినిమాలు వస్తున్నా.. ఎక్కువ శాతం  ప్రేమకథలు, దెయ్యం, భూతం వంటి కథలే వస్తున్నాయి. అవి తప్పితే ప్రేక్షకులకు దేశభక్తితో కూడిన కథలతో సినిమాలు చేయలేమా? చేస్తే.. పెద్ద హీరోలతోచేయాలా? కొత్త హీరోలు చేస్తే.. జనాలు చూడరా? ఒకప్పుడు ప్రతిఘటన, ఈ చరిత్ర ఏ సిరాతో? వంటి చిత్రాలన్నీ కొత్తవారితో తీసినవే.. అందులో కథ ప్రధానం.. నా సినిమాకూ కథే కీలకం.. అంటూ.. 'అర్థనారి' చిత్రం గురించి దర్శకుడు భానుశంకర్‌ తెలియజేస్తున్నారు. అర్జున్‌ యజత్‌, మౌర్యాని హీరోహీరోయిన్లుగా భరత్‌ రాజ్‌ సమర్పణలో పత్తికొండ సినిమాస్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రమిది. భానుశంకర్‌ చౌదరి దర్శకత్వంలో రవికుమార్‌.ఎమ్‌ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ శుక్రవారమే విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు భానుశంకర్‌ చౌదరితో ఇంటర్వ్యూ....
 
గతంలో తీసిన చిత్రాలకు దీనికి తేడా ఏమిటి?
నేను గతంలో సరదాగా అమ్మాయితో, రాజు మహారాజు చిత్రాలు తీశాను. అందులోనూ చక్కటి సందేశం కూడా వుంది. అయితే.. రొటీన్‌ కథలతో సినిమాలు చేస్తుంటే.. కొత్తగా యువతలో దేశభక్తిని పెంపొందించే కథను రాసుకుని చేయాలనిపించింది. ఇందుకు నిర్మాతలు చాలా సహకరించారు. ఇది రొటీన్‌ సినిమా కాదు. ఓ ప్రతిఘటన.. తరహాలో వుంటుంది.
 
ఈ టైటిల్‌ పెట్టడానికి కారణం?
సగం ఆడ, సగం మగ, అర్థనారీశ్వర తత్వం. అందుకనే ఓ హిజ్రా గెటప్‌ను తీసుకుని చేశాం. ఆ గెటప్‌లో హీరో తన లక్ష్యాలను ఎలా సాధించాడనేదే కథ. 
 
గతంలో 'కాంచన' వంటి చిత్రాలు వచ్చాయి.. దీనికి తేడా ఏమిటి?
ఇది రివేంజ్‌ డ్రామా కాదు. సమాజంలో ఒక పర్‌పస్‌ కోసం హిజ్రా ఏమి చేసిందని కథ. వారికి కొన్ని ఎమోషన్స్‌ వుంటాయి. ఇందులో అందరూ కొత్త నటీనటులే. 55 మంది కొత్తవారిని పరిచయం చేస్తున్నాను. కొత్తవాళ్లైనప్పటికీ చాలా అద్భుతంగా చేశారు.
 
ఈ తరహా కథ చేయడానికి కారణం?
అందరూ ఎంటర్‌టైన్మెంట్‌ అంటే కామెడి కాబట్టి కమెడియన్స్‌ అవరసమని భావిస్తున్నారు. వారు లేకుంటే సినిమాలు ఆడవని అనుకుని వారి వెనుక పరిగెడుతున్నారు. కానీ నా ఫీలింగ్‌ చెప్పాలంటే ఓ ఎమోషన్‌ ఉంటే సినిమా ఆడదా? ఒకప్పుడు రేపటి పౌరులు, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు ఇలాంటి ఎమోషనల్‌ పాయింట్స్‌ ఉన్న చిత్రాలు సక్సెస్‌ అయ్యాయి కదా. మరిప్పుడు మనం అలాంటి ఎమోషనల్‌ సినిమాలను పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఆ పద్ధతిలో సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించి దానికి దేశభక్తిని మిళితం చేసి తీసిన ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌.
 
ఈ కథను కొత్తవారితో చేయడానికి కారణం?
ఈ కథను ముందుగా పలువురు పేరున్న హీరోలకు చెప్పాను. ఆ గెటప్‌ కాస్తా డిఫరెంట్‌గా ఉందని ఆలోచించి వద్దన్నారు. దాంతో నేను కొత్తవారితో సినిమా చేశాను.
 
ఈ సినిమా ఉద్దేశం ఏమిటి?
ఇంతకు ముందు హిజ్రాలపై వచ్చిన కాన్సెప్ట్‌ అనేది లింగ బేధాలపై తీసిన సినిమాలు. కానీ ఇది అలాంటి సినిమా కాదు. అర్ధనారి అయిన ఓ వ్యక్తి సమాజం కోసం ఏ చేశాడనేదే సినిమా. అదేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.   
 
కొత్త హీరో ఎలా చేశాడు?
హీరో అర్జున్‌ యజత్‌. తనది విజయవాడ. ఇందులో హిజ్రా పాత్రధారిగా కనిపిస్తాడు. అందుకోసం హిజ్రాల బాడీ లాంగ్వేజ్‌ను మనం చాలాచోట్ల గమనించే ఉంటాం కాబట్టి అందుకు తగిన విధంగా తనకు ట్రైనింగ్‌ ఇచ్చాం. తను పాత్రలో ఇమిడిపోయాడు. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ వంటి అద్భుత నటుడని చెప్పగలను. అసలు ఇది ఆ రేంజ్‌వారు చేయాల్సిన సినిమా. ఈ కథను ముందుగా పెద్ద  హీరోలకు చెప్పినప్పుడు హిజ్రా గెటప్‌లో హీరోను ఆడియెన్స్‌ అంగీకరిస్తారా! అని అడిగారు. ప్రయోగం చేయడానికి పెద్ద హీరోలు అంగీకరించడం లేదు. చిన్నవాళ్ళతో చేస్తే వ్యాపారం ఉండటం లేదు. కానీ నేను ధైర్యం చేసి 95 రోజుల షూటింగ్‌ చేశాను. కొత్తవాళ్లతో సినిమా అని ఇన్నిరోజులు షూటింగ్‌ ఏంటని! అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే సినిమాకు న్యాయం చేయాలంటే అన్ని రోజులు షూటింగ్‌ చేయాలనిపించి చేశాను.
 
ఎంతవరకు ప్రేక్షకులకు చేరుతుందని భావిస్తున్నారు?
కథను నమ్మితే ప్రేక్షకుడు బ్రహ్మరథం పడతారిని చాలా చిత్రాలు నిరూపించాయి. 'బారతీయుడు' వంటి యాక్షన్‌ సినిమా, మెసేజ్‌ ఉన్న సినిమా ఎమోషనల్‌ సినిమాను కొత్త వాళ్లతో చేస్తారా? ఎవరూ చేయరు. ఎందుకంటే కొత్తవాళ్లతో అలాంటి సినిమా చూస్తే చూడరు! అనే దక్పథంతో సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రతిఘటన వంటి గొప్ప సినిమాలన్నీ కొత్త వాళ్లతో తీసినవే.
 
కథలోని పాయింట్‌ ఏమిటి?
'బాధ్యత లేనివాడికి భారతదేశంలో బ్రతికే హక్కు లేదు' అనేదే ఈ సినిమా కాన్సెప్ట్‌. కొత్తవాళ్లతో కొత్త ప్రయోగం చేస్తున్నావ్‌ వ్యాపారం అవుతుందా అని అడిగారు కూడా. 20-30 కోట్ల వ్యాపారం ఉండే హీరో సినిమా విడుదలయ్యే అంత సంఖ్యలో కానీ ఈరోజు నా సినిమా 300 థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఇండస్ట్రీలోని టాప్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ సినిమా చూసి ఉద్వేగానికి లోనై లేచి నిలబడి క్లాప్స్‌ కొట్టారు. నా సినిమా విడుదలకు అండగా నిలబడ్డారు. నేను ఇలా మాట్లాడుతున్నానంటే కారణం వారే. ఇంత ధైర్యంగా సినిమా గురించి మాట్లాడుతున్నానంటే కారణం నిర్మాతలే. సినిమా తెరకెక్కించడంలో నాకు ఎంతో సపోర్ట్‌ చేశారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మృణాల్ సేన్‌ను జీవించి ఉండగానే చంపేసిన నెటిజన్లు.. కుటుంబ సభ్యుల ఆవేదన!