Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'హలో'పై ఏం చెప్పను? మైండ్ బ్లాంక్ అయ్యింది... నాగార్జున ఇంటర్వ్యూ

'మనం' అనేది సెంటిమెంట్‌గా భావించి మనం ఎంటర్‌ప్రైజెస్‌ పెట్టాం. దానిలో నేను, నాగచైతన్య, అఖిల్‌ వున్నాం. దానికితోడు అన్నపూర్ణ స్టూడియోస్‌‌తో కలిసి 'హలో' సినిమా తీశాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు

'హలో'పై ఏం చెప్పను? మైండ్ బ్లాంక్ అయ్యింది... నాగార్జున ఇంటర్వ్యూ
, బుధవారం, 6 డిశెంబరు 2017 (19:33 IST)
'మనం' అనేది సెంటిమెంట్‌గా భావించి మనం ఎంటర్‌ప్రైజెస్‌ పెట్టాం. దానిలో నేను, నాగచైతన్య, అఖిల్‌ వున్నాం. దానికితోడు అన్నపూర్ణ స్టూడియోస్‌‌తో కలిసి 'హలో' సినిమా తీశాం. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు నేను దగ్గరుండి చూసుకుంటున్నానంటూ బుధవారం నాడు అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో విలేకరుల సమావేశం నాగార్జున వెల్లడించారు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి ఆయన ఈ విధంగా చెప్పారు.
 
సినిమా గురించి ఏం చెప్పాలో తెలియడంలేదు. ప్రశ్నలడిగితే సమాధానాలు చెబుతా.. మైండ్‌ బ్లాంక్‌ అయిపోయిందంటూ.. మొదటి మాటతో ప్రారంభించిన నాగార్జున, తనే ఈ విధంగా చెప్పసాగారు.
 
'హలో ఈ నెల 21న విడుదలవుతుంది. టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. దాంతో మాకు జోష్‌ వచ్చింది. ట్రైలర్‌ కూడా అదేతీరు. యూ ట్యూబ్‌, డిజిటల్‌తో కూడా మిలియన్‌కు టచ్‌ అయింది. ఆడియోను 10వ తేదీన వైజాగ్‌లోని ఎం.జి.ఎం. గ్రౌండ్‌లో చేయాలని నిర్ణయించాం. అలాగే అఖిల్‌తో గట్టిగా చెప్పాను. స్టూడియోలో పాటలు పాడటంకాదు. లైవ్‌లో పాట పాడాలని చెప్పాను. దానికి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. మరో పాటకు డాన్స్‌ కూడా చేయబోతున్నాడు. రెండు గంటలపాటు ఫంక్షన్‌ జరుగుతుంది. 
 
'మనం' సినిమా తీసేముందు విక్రమ్‌ కుమార్‌ వచ్చాడు. చెప్పినట్లు తను బాగా అద్భుతంగా తీశాడు. ఇప్పుడు అఖిల్‌తో బాధ్యతగా తీశాడు. 9 నెలల పాటు స్క్రిప్ట్‌పై శ్రద్ధపెట్టాం. బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ స్టోరీ. టీజర్‌ యాక్షన్‌తో వున్నా.. రొమాన్స్‌ కూడా వుంది. విక్రమ్‌ సినిమాలో వున్న మ్యాజిక్‌ నడుస్తుంది. ఆ మ్యాజిక్కే ఎలా విడదీస్తుంది. ఎలా కలుపుతుందనేది కథ. అఖిల్‌ కూడా రెండేళ్ళుగా మంచి సినిమా కోసం ఎదురుచూశాడు. దర్శకుడు ప్రియదర్శిని కుమార్తె కళ్యాణి ప్రియదర్శిని నాయికగా నటించింది. లొకేషన్‌లో అందరూ తను బావుందని పేరు తెచ్చుకుంది. కళ్యాణి అమ్మగారు లిజీని హీరోయిన్‌గా నాతో పరిచయం చేయాల్సింది. అప్పుడు కుదరలేదు. అలాంటిది ఆమె కుమార్తెను అఖిల్‌తో పరిచయం చేయడం థ్రిల్‌గా వుందని తను చెప్పారు. ఈ చిత్రంలో యాక్షన్‌ కూడా కొత్తగా వుంటుంది. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ పవర్‌ అనే అతన్ని తీసుకువచ్చి చేశాం. 
 
30 రోజుల పాటే చేశాం. ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ గాల్లోనే వుంటుంది. ఫస్ట్‌ టైమ్‌ హైదరాబాద్‌ మెట్రోలో కూడా చేశాం. ఇది తెలుగు స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనివిధంగా వుంటుంది. చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. ఒకరకంగా చెప్పాలంటే.. జాకీచాన్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ గుర్తుకువస్తాయి. రొమాన్స్‌, ఎమోషన్స్‌ విక్రమ్‌ తరహాలో నింపాడు. వినోద్‌ ఫొటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. 
 
విక్రమ్‌ చెప్పే కథలో పజిల్స్‌ వుంటాయి. అవి కూడా అందరికీ అర్థమయ్యేట్లుగా సింపుల్‌గా వుంటాయి. 'మనం' నాన్నగారి చివరి సినిమా. ప్రేమతో అందరం గుండెపెట్టి చేశాం. దానికి ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు మర్చిపోలేనిది. వాళ్ళిచ్చిన అవార్డే పెద్దది. నంది ఇవ్వకపోయినా పర్వాలేదు.
 
అఖిల్‌ తన సోల్‌మేట్‌ కోసం 15 ఏళ్లుగా వెతుకుతూనే వుంటాడు. అది ఎలా రన్‌ అవుతుందనేది ఆసక్తిగా ఇందులో దర్శకుడు చూపించాడు. ఇప్పుడు ప్రేక్షకులు ఎందుకు థియేటర్‌కు రావాలని ముందుగానే నిర్ణయించుకుని వస్తున్నారు. టీజర్‌, ట్రైలర్‌ చూపించాక.. వారిలో ఒక ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. అలాగే రేపు ఒక సాంగ్‌ను విడుదల చేయబోతున్నాం. ఇక హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ చేస్తాం. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాను. యు.ఎస్‌. ప్రమోషన్‌కు అఖిల్‌ వెళతాడు. ఇక్కడ పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు నేను చూసుకుంటాను. నేను అఖిల్‌ను ఎలా చూడదలచుకున్నానో అలా ఈ సినిమాలో చూస్తున్నాను.
 
నాకు ప్రతి సినిమా టెన్షన్‌గా వుంటుంది. సరిగ్గా నిద్ర కూడా వుండదు. ఈసారి సంక్రాంతికి ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. థియేటర్లు అందరికీ సరిపోతాయి. నేను ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేయలేదు. వాయిస్‌ ఓవర్‌ మాత్రమే ఇచ్చాను. అనూప్‌ రూబెన్స్‌తో ట్రైలర్‌ చేయించాం.
 
నా కొత్త చిత్రాలు... రామ్‌గోపాల్‌వర్మతో చేస్తున్న నా సినిమా చాలా బాగా వస్తుంది. ఏప్రిల్‌లో రిలీజ్‌ చేయబోతున్నాం. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాగచైతన్యతో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. దానికి కొంత వ్యవధి పడుతుంది. ఇక నేను కూడా కొద్దికాలంపాటు ప్రొడక్షన్‌ చూసుకోకుండా నటనపైనే దృష్టిపెడతా అని చెప్పారు నాగార్జున.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారు.. భేష్: మహేష్ కత్తి