Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆమె పెక్యులర్‌గా కనిపించింది.. అందుకే...: నాగార్జున

Advertiesment
అక్కినేని నాగార్జున
WD
అక్కినేని నాగార్జున తాజా చిత్రం 'కేడి' శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఆయనతో ఇంటర్య్యూ...
బాస్‌, మాస్‌, డాన్‌, కేడి... రెండక్షరాల సెంటిమెంటా?
సెంటిమెంట్‌ అనేదికాదు. సింపుల్‌గా అందరూ పలకడానికి ఈజీగా ఉంటున్నాయని అలా పెట్టాం. సెంటిమెంట్‌ అయితే బాస్‌ సరిగ్గా ఆడలేదు. అయినా డాన్‌ అని పెట్టాను. అలాగే డిసెంబర్‌ నెల నాకు సెంటిమెంట్‌ అనేవారు. డిసెంబర్‌లో విడుదలచేయడంలేదుకదా... ఏదో ఒక చోట సెంటిమెంట్‌ ఉంటుంది. కానీ అది అన్నింటికీ వర్తించదు.

మమతామోహన్‌దాస్‌ను ఎంపికచేసుకోవడానికి విశేషమైనా ఉందా?
ఆమెతో నేను 3వ సినిమా చేస్తున్నాను. వర్క్‌లో సిన్సియర్‌. ఏ ప్రాబ్లమ్‌ ఉండదు. 'కింగ్‌'లో 12 మంది హీరోయిన్లతో చేస్తుంటే.. ఆమె పెక్యులర్‌గా అనిపించింది. అందులో పెద్దగా పాత్ర ఇవ్వలేకపోయాను. అందుకే ఈ చిత్రంలో ఆమెను ఎంపికచేయడం జరిగింది.

2009 మిస్‌ అయినట్లు ఫీలయ్యారా?
అది నా చేతుల్లో లేదు. సినిమా ప్రారంభమే ఆలస్యమైంది. డిసెంబర్‌లో అనుకున్నాం. కుదరలేదు. టెక్నికల్‌ వాల్యూస్‌ బాగా ఉండాలని కేడీకి కేర్‌ తీసుకున్నాం.

బయట బ్యానర్‌లో చేయకపోవడానికి కారణం?
శివప్రసాద్‌రెడ్డి నాన్నగారి అభిమాని. ఆ తర్వాత నా అభిమానిగా మారి.. నాతో చిత్రాలు తీయడం ప్రారంభించాడు. 25 ఏళ్ళలో ఇంతవరకూ ఎటువంటి ప్రాబ్లమ్‌ రాలేదు. అలా అని బయట నిర్మాతలకు చేయనని చెప్పడంలేదు. మంచి కథాంశం తీసుకుని వస్తే చేస్తా.

అన్నమయ్య లాంటి చిత్రాల్లో చేసే ఆలోచన ఉందా?
నేను రెడీ. కానీ అటువంటి కథ మళ్ళీ దొరకాలి. అప్పట్లో రాఘవేంద్రరావుగారు నా దగ్గరకు కథ తీసుకుని వచ్చి చేద్దాం అన్నారు. మరి అలాంటి వారు రావాలి. నాకై నేను కథ రెడీ చేసుకోలేను.

'కేడి' అనే నెగెటివ్‌ టైటిల్‌ పెట్టడానికి కారణం?
నెగెటివ్‌ పాజిటివ్‌ అనేది కాదు. క్యాచీగా ఉందాలేదా? 1995లో 'ము..ముద్దంటే చేదా..' అనే పాట నెగటివ్‌ అని గోల చేశారు. చిరంజీవిపై 'రాక్షసుడు', ఎన్‌.టి.ఆర్‌.తో 'కేడి నెం.1' చిత్రాలు వచ్చాయి. బాగానే ఆడాయి. అంతెందుకు.. 'నిన్నే పెళ్లాడుతా' టైటిల్‌ పెడితే.. అలా పెట్టకూడదు. అది వేరే అర్థం వస్తుందని.. ఆ టైటిల్‌తో అమ్మాయిలను అబ్బాయిలు టీజ్‌ చేస్తుంటారని మహిళా సంఘాలు గోల చేశాయి. కానీ అటువంటిది ఏమీ జరగలేదుకదా.

మీతో ఏసుక్రీస్తు వంటి పాత్ర చేయాలనుందని నాన్నగారు ఓ సందర్భంలోఅన్నారు?
నాకైతే తెలీదు. ఒకసారి 'వేమన' చేయాలనుందని చెప్పినట్లు నాతో ఎవరో అన్నారు. నాన్నగారు ఇలాంటి విషయాలు నాతో చెప్పరు. మీరు ఏదో అడుగుతారు. అందుకు ఆయన అలా బదులిచ్చి ఉండవచ్చు. ఏసుక్రీస్తు పాత్ర అంటే.. ఇంగ్లీషులో మహామహులు పోషించారు. దాన్ని మళ్ళీచేయడం హాస్యాస్పదమే. 'పాసింగ్‌ క్రైస్త్‌' అనే సినిమాను మెల్‌గిబ్‌సన్‌ చేశాడు. క్రీస్తు రేపు చనిపోతాడనగా ఆయన ఎటువంటి అనుభూతులకు గురయ్యాడనేది సినిమా తీశాడు. అటువంటి కొత్త కథతో వస్తే నేను సిద్దంగా ఉన్నా.

మీకీమధ్య బాగా నచ్చి సినిమా?
'3 ఇడియట్స్‌', 'పా' చిత్రాలు. అదుర్స్‌, నమో వెంకటేశ చిత్రాలు చూడలేదు. అవికూడా బాగున్నాయని విన్నాను.

'జోష్‌' సినిమా నాగచైతన్యకు ఎటువంటి పేరు తెచ్చిపెట్టింది?
ఆ సినిమా బాగా ఆడలేదు. కానీ హీరోగా బాగా పేరు వచ్చింది. రొటీన్‌ హీరో గాకుండా స్పెషల్‌ ఇమేజ్‌ తెచ్చుకునేలా ఆల్‌రౌండర్‌ కావాలనేది చెబుతుంటాను. నేను మజ్ను, గీతాంజలి, శివ చిత్రాలు చేయకపోతే ఈపాటి నాగార్జున ఎవరికీ తెలియకపోవచ్చు. అందుకే ప్రతి చిత్రాన్ని కొత్తకోణంలో చేయాలని చైతన్యకు చెబుతాను.

'ఏమి మాయ చేసావె' పాటలు ఎలా అనిపించాయి?
మంచి మెలోడి పాటలు. స్లో పాయిజన్‌గా ఎక్కుతాయి. ఎ.ఆర్‌. రెహమాన్‌ చక్కని ట్యూన్స్‌ ఇచ్చాడు. ఆ పాటలు వింటుంటే.. ఒకప్పటి గీతాంజలి గుర్తుకువస్తుంది. నేను రింగ్‌టోన్స్‌ పెట్టుకోను. కానీ ఇందులో 'ఈ హృదయం..' అనే పాటను నా ఫోన్‌కు రింగ్‌టోన్‌గా పెట్టుకున్నాను.

నాన్నగారు, మీరు, చైతన్య కలిసి నటించే అవకాశం ఉందా?
తప్పకుండా... కానీ అటువంటి సబ్జెక్ట్‌ సిద్ధంచేసి ఎవరైనాముందుకువస్తే.. మేమే తీస్తాం.

Share this Story:

Follow Webdunia telugu