Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింటేజ్ రైలు పక్కన సెల్ఫీకి యత్నించిన యువతి దుర్మరణం!!

Advertiesment
వింటేజ్ రైలు పక్కన సెల్ఫీకి యత్నించిన యువతి దుర్మరణం!!

వరుణ్

, శుక్రవారం, 7 జూన్ 2024 (09:03 IST)
నేటి యువతి సెల్ఫీల మోజుతో ఎంతో విలువైన తమ ప్రాణాలను కోల్పోతున్నారు. వింటేజ్ రైలు వస్తుండగా దాని పక్కన నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. స్టీమ్ ఇంజిన్‌తో నడిచే రైలింజిన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదకర ఘటన మెక్సికోలోని హిడాల్కో ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మెక్సికోలోని హిడాల్కోలో ఆవిరి ఇంజిన్‌తో నడిచే రైలును చూసేందుకు నిత్యం ఔత్సాహికులు రైలు పట్టాల వద్ద క్యూ కడుతుంటారు. రైలు సమీపించే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఓ యువతి కూడా సెల్ఫీ దిగే క్రమంలో అత్యుత్సాహంతో ప్రాణాలు పోగొట్టుకుంది. సెల్ఫీ బాగా రావాలనే ప్రయత్నంలో ఆమె పట్టాలకు బాగా దగ్గరకు జరిగింది. ఈ క్రమంలో ఆమెను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనపై ఆమె తల భాగంలో తీవ్రంగా గాయం కావడంతో ఆమె అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలు చూసిన ఇతరు ఔత్సాహికులు అక్కడ నుంచి భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.  

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడాలి నానిపై ఆగ్రహం... గుడివాలో నాని వాసనలు లేకుండా చేస్తున్న టీడీపీ కేడర్!!