ఆన్‌లైన్ ద్వారా ఆహారం ఆర్డర్ చేస్తున్న వారికి ఇది షాకింగ్ ఇచ్చే వార్తే. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన చికెన్ వ్రాప్‌లో కత్తి వుండటం చూసి కస్టమర్ షాకైన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలి అనే యువతి ఆన్ లైన్ ద్వారా చికెన్ వ్రాప్‌ను ఆర్డర్ చేసింది.
ఆ ఆర్డర్ డెలివరీ అయ్యాక.. ఆ ఫుడ్‌ను తినేందుకు ఆత్రుత బయటికి తీసింది. ఇంకా తినడం ప్రారంభించింది. అయితే పంటికి కొరికేందుకు ఏదో బాగా కష్టమనిపించింది.
ఒకవేళ చికెన్ ముక్కేనేమోనని అనుకుని బయటికి తీసి చూస్తే.. షాక్ అవక తప్పలేదు. అది ఆరెంజ్ కలర్ హ్యాండిల్‌తో కూడిన కత్తి అని తేలింది. దీంతో షాకైన ఆ యువతి ఈచికెన్ వ్రాప్‌లో కత్తిని చూశానని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట పోస్టు చేసింది. ఈ పోస్టు నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసినవారంతా.. డెలివరీ చేసిన సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.