Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరుగుతున్న మంచుపర్వతాలు... భూగోళానికి ముంచుకొస్తున్న పెనుముప్పు

భూగోళానికి పెనుముప్పు పొంచివుంది. ధృవ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీంతో మంచు పర్వతాలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ కారణంగా సముద్ర నీటి మట్టాలు పెరిగి... భూగోళంలోని లోతట్టు ప్రాంతా

Advertiesment
Polar Regions
, శనివారం, 4 మార్చి 2017 (19:00 IST)
భూగోళానికి పెనుముప్పు పొంచివుంది. ధృవ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. దీంతో మంచు పర్వతాలు క్రమంగా కరిగిపోతున్నాయి. ఈ కారణంగా సముద్ర నీటి మట్టాలు పెరిగి... భూగోళంలోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయే ప్రమాదం పొంచివుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. 
 
గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) కారణంగా పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భూమి వేగంగా వేడెక్కుతోంది. ఈ కారణంగా ధ్రువ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా ఉత్తర అంటార్కిటిక్‌లోని అర్జెంటీనా రీసర్చ్ సెంటర్ 'ఎస్పరాంజా' బేస్ వద్ద గతంలో ఎన్నడూ లేనంతగా 17.5 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. 
 
జనవరి 1982లో ఇదేప్రాంతంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు ఇక్కడ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని, గత రికార్డును బద్ధలుకొట్టడం ఇదే తొలిసారని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది. దీంతో పర్యావరణవేత్తలు, పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 
 
ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే అక్కడి మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే పలు దేశాల్లోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు ప్రపంచంలోని పలు ప్రాంతంలోని ద్వీపాలు కూడా ఈ దెబ్బతో కనమరుగవుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైలులోనే శశికళకు సీఎం కలలు.. పన్నీర్‌దే ముఖ్యమంత్రి పదవి: పాండ్యరాజన్