Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నీటీలో కరోనా అవశేషాలు.. కోవిడ్ ఎలా పుట్టిందో కనుగొంటాం.. చైనాకు టీమ్

నీటీలో కరోనా అవశేషాలు.. కోవిడ్ ఎలా పుట్టిందో కనుగొంటాం.. చైనాకు టీమ్
, సోమవారం, 20 ఏప్రియల్ 2020 (13:18 IST)
పార్కులు, రోడ్లు శుభ్రపరచడానికి వాడే నీటీలో కరోనా అవశేషాలు ఉన్నట్టు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ నగరంలో జరిపిన నీటి నాణ్యత పరీక్షల్లో తేలింది. మొత్తం 24 నీటి శాంపిల్స్‌ను పరీక్షించగా... కేవలం నాలుగింటిలో అదీ కూడా చాలా తక్కువ స్థాయిలో మాత్రమే వైరస్ కణాలను గుర్తించారు. దీంతో స్థానికంగా కొంత ఆందోళన చెలరేగింది. అయితే కంగారు పడాల్సిందేమీ లేదని అధికారులు తెలిపారు.
 
తాగునీరు, ఇతర అవసరాలకు వినియోగించే నీరు..రెండూ వేరు వేరు నెట్వర్కుల ద్వారా సరఫరా అవుతందని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. కాబట్టి కరోనాతో తాగునీరు కలుషితమైందన్న భయాలు అనవసరమని చెప్పుకొచ్చారు. ఇంకా ప్రజలు నిశ్చింతగా ఉండాలని కోరారు.
 
ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ అనేది సృష్టిలో పుట్టింది కాదనీ... ల్యాబ్‌లో తయారుచేసినదని ఫ్రాన్స్‌కి చెందిన ఓ వైరాలజీ శాస్త్రవేత్త అనడంతో... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే ఇలాంటి చాలా ఆరోపణలు విన్నానన్న ఆయన.. చైనాకు అమెరికా బృందాన్ని పంపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 
 
చైనాలోని వుహాన్‌కి వెళ్లి అక్కడ కరోనా వైరస్ ఎలా వ్యాపించింది, ఎందుకు వ్యాపించింది, అసలు కరోనా వైరస్ ఎలా పుట్టింది? ల్యాబ్‌లో అది తయారయ్యే ఛాన్స్ ఉందా? లేక గబ్బిలాలు లేదా పాములు లేదా ఆలుగుల నుంచి అది వచ్చిందా? అన్ని విషయాలపై అమెరికా బృందం పరిశోధన చెయ్యనుంది. మామూలుగా ఇలాంటి టీమ్స్‌ని చైనా రానివ్వదు. కానీ... పంపుతున్నది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాబట్టి... చైనా ఆపే సాహసం చెయ్యదనే అనుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విప్రోకు ఎంత పెద్దమనసు.. రోజుకు 60వేల మందికి ఆహారం