Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్రమ వలసదారులకు ట్రంప్ తాజా వార్నింగ్.. అక్రమంగా అడుగుపెట్టారో...

Advertiesment
donald trump

ఠాగూర్

, మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (13:59 IST)
తమ దేశంలో అక్రమంగా అడుగుపెట్టే వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంలోని అక్రమంగా ప్రవేశిస్త ఉగాండా, ఎస్వథిని, సౌత్ సూడాన్‌లలోని జైళ్లకు పంపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. స్వదేశాలలో నేరాలు చేసి పారిపోయి తమ దేశంలోకి వస్తున్నారంటూ అక్రమ వలసదారులపై ఆయన మండిపడ్డారు. అమెరికాలోకి చ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బైడెన్ సర్కారు అవలంభించిన కొన్ని విధానాల వల్ల నేరస్థులు అమెరికా గడ్డపై స్వేచ్చగా తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
ఇటీవల డల్లాస్‌లో భారత సంతతికి చెందిన నాగమల్లయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై ట్రంప్ స్పందిస్తూ, నాగమల్లయ్యను చంపిన హంతకుడు యోర్డానిస్ కోబోస్ మర్టినెజ్ క్యూబా పౌరుడని, అమెరికాలోకి అక్రమంగా వచ్చాడని తెలిపారు. తంలో చిన్న పిల్లలపై అఘాయిత్యం, వాహనాల దొంగతనం కేసులో మార్టినెజ్‌ను పోలీసులు జైలుకు పంపించారని గుర్తు చేశారు. అయితే, బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఆయన జైలు నుంచి విడుదలై నాగమల్లయ్యను హత్య చేశాడని తెలిపారు. చట్టాలను కఠినంగా అమలు చేసివుంటే మార్టినెజ్ బయటకు వచ్చేవాడు కాదని, ఇపుడు ఆయనను క్యూబాకు డిపోర్ట్ చేసే ప్రయత్నం చేసినా ఆ దేశం అంగీరించలేదన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఇలాంటి నేరస్థులను అటు వారి స్వదేశానికి పంపకుండా ఇటు అమెరికాలో ఉండనివ్వకుండా మూడో దేశానికి పంపిస్తున్నామని తెలిపారు. ఇలాంటి నేరస్థులు ఉగాండా, ఎస్వతిని, సౌత్ సూడాన్ వంటి దేశాలకు పంపించి అక్కడి జైళ్లలో ఉంచుతామని తెలిపారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఇదే తరహా శిక్షలను అమలు చేస్తామని డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Lok Sabha Rankings: లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడిదే అగ్రస్థానం