Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికా ఉపాధ్యక్ష పదవికి నామినేట్ అయిన ఇండియన్ అమెరికన్ కమలా హారిస్

Advertiesment
US elections 2020
, గురువారం, 20 ఆగస్టు 2020 (12:03 IST)
డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్‌లో యుఎస్ సెనేటర్ కమలా హారిస్ 2020 ఎన్నికలకు డెమొక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బుధవారం నామినేట్ అయ్యారు. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఆమెకి మద్దతు పలికారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌తో కలిసి, సమగ్రమైన యునైటెడ్ స్టేట్స్‌ను నిర్మిస్తామని ఆమెతో పాటు వీరందరూ ప్రతిజ్ఞ చేశారు.
 
ఆమె ఒక ప్రధాన పార్టీ నుండి ఉపాధ్యక్ష పదవి కోసం పోరాడిన మొదటి బ్లాక్ అమెరికన్ మాత్రమే కాదు మొదటి భారతీయ-అమెరికన్. ‘చట్టం ప్రకారం సమాన న్యాయం వాగ్దానాన్ని నెరవేర్చడానికి పోరాటం ప్రారంభ'మైందని ఆమె ట్వీట్ చేశారు.
 
హారిస్ ఎంపికైన తర్వాత తన ప్రసంగంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన విరుచుకపడ్డారు. ట్రంప్ విధానాలు అమెరికా పౌరుల జీవితాలను మరియు జీవనోపాధిని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖపట్టణంలో ప్రారంభమైన పాలన రాజధాని నిర్మాణం?