Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

180 మంది పిల్లలకు తండ్రి.. కానీ, ఒక్క భార్య కూడా ప్రేమగా ముద్దు పెట్టలేదట...

baby boy

వరుణ్

, మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (12:14 IST)
అతను ఏకంగా 180 మంది పిల్లలకు తండ్రి. కానీ, ఒక్కరంటే ఒక్క భార్యకు కూడా ముద్దు పెట్టలేదట. ఆ వ్యక్తి పేరు జో డోనార్. బ్రిటన్‌ వాసి. అయితే, అతను 180 మంది పిల్లలకు ఏవిధంగా తండ్రి అయ్యాడన్నదే కదా మీ సందేహం. అయితే, వివరాల్లోకి వెళదాం... యూకేకు చెందిన జో డోనార్ ఓ జీన్స్ దాత (స్పెర్మ్ డోనర్). అసలు పేరు వేరే ఉన్నా జో డోనర్‌గానే మంచి గుర్తింపు పొందాడు. పదమూడేళ్లుగా వీర్యదానం చేస్తూ ఇప్పటి వరకు 180 మందికి తండ్రయ్యాడు. 
 
తాను లైంగిక సుఖం కోసమే ఇలా చేస్తున్నానని కొంతమంది విమర్శించడంపై విచారం వ్యక్తం చేశాడు. ఇంతమందికి తండ్రయినా ఇప్పటి వరకూ ఒక్క మహిళ నుంచి కూడా ప్రేమగా ముద్దు అందుకోలేదని చెప్పాడు. కొంతమంది మహిళలు తల్లి కావడానికి తనతో లైంగికంగా కూడా కలిశారని చెప్పాడు. అయితే, అది కేవలం గర్భం కోసం చేస్తున్న పనిలానే, అవసరం మేరకు జరిగిందని వివరించాడు. 
 
అవతలి వ్యక్తి దృష్టి మొత్తం గర్భందాల్చడంపైనే ఉండడంతో ప్రేమగా కౌగిలించుకోవడం కానీ, కలయిక తర్వాత హత్తుకుని సేదతీరడమో జరగలేదని జో డోనార్ తెలిపాడు. నెలలో ఒకరో ఇద్దరో తనను కలుస్తారని, గర్భం దాల్చిన తర్వాత మళ్లీ తనను కలవరని వివరించాడు. స్పెర్మ్ డోనార్‌గా మారి 180 మందికి తండ్రిని అయినా తనకంటూ ఓ కుటుంబమే లేదని వాపోయాడు. జో డోనార్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ కావడంతో ఆయన జీవితంపై బాలీవుడ్‌లో ఓ సినిమా కూడా వచ్చింది. 'విక్కీ డోనార్' పేరుతో వచ్చిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్‌లు నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ: రేవంత్ రెడ్డి