Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రంప్‌ను ఈసడించుకుంటున్న రాణి ఎలిజిబెత్... ట్రంప్ భార్య మలేనియా షాక్....

ముస్లి దేశాల పౌరులకు ప్రవేశ నిషేధం అంటూ కఠినాతికఠినమైన ఆంక్షలు పెట్టి లక్షలాదిమందిని ఇబ్బంది పెడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మా దేశంలోకి ఎలావస్తాడో చూస్తాం అంటున్నారు ఆ దొడ్డ దేశం ప్రజలు. ప్రజలే

ట్రంప్‌ను ఈసడించుకుంటున్న రాణి ఎలిజిబెత్... ట్రంప్ భార్య మలేనియా షాక్....
హైదరాబాద్ , బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (19:27 IST)
ముస్లి దేశాల పౌరులకు ప్రవేశ నిషేధం అంటూ కఠినాతికఠినమైన ఆంక్షలు పెట్టి లక్షలాదిమందిని ఇబ్బంది పెడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మా దేశంలోకి ఎలావస్తాడో చూస్తాం అంటున్నారు ఆ దొడ్డ దేశం ప్రజలు. ప్రజలే కాదు.. ఆ దేశ మహారాణి సైతం స్త్రీల పట్ల ట్రంప్‌‌కున్న ద్వేషాన్ని, వారిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న రాణి ట్రంప్ అధికారిక పర్యటనపైనే నిషేధం విధించే ఆలోచనల్లో ఉన్నారని తెలుస్తోంది. 
 
గత కొద్ది రోజులుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిటన్ సందర్శనకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణకు ఆన్‌లైన్‌లో అనూహ్య స్పందన లభిస్తోంది. ట్రంప్ బ్రిటన్ పర్యటనను అడ్డుకోవాలంటూ ఆన్‌లైన్‌లో పెట్టిన పిటిషన్‌పై ఇప్పటి వరకు పది లక్షల మంది సంతకాలు చేశారు. ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ నిషేధాజ్ఞలు విధించడంతో గుర్రుగా ఉన్న ప్రజలు తాజా పిటిషన్‌పై స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్నారు. 
 
‘డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ కింగ్‌డమ్‌ పర్యటనను అడ్డుకోండి’ పేరుతో బ్రిటన్ పార్లమెంట్‌లో పెట్టిన ఈ పిటిషన్‌పై శనివారం మధ్యాహ్నానికే పది లక్షల మంది సంతకాలు చేశారు. ‘హౌస్ ఆఫ్ కామన్స్’లో చర్చించాలంటే కనీసం లక్షల సంతకాలు అవసరం. అయితే ఏకంగా పది లక్షల సంతకాలు రావడం గమనార్హం. దీంతో పార్లమెంట్‌లో ట్రంప్ పర్యటనపై చర్చించనున్నారు.  ఈ విషయాన్ని ‘హౌస్ ఆఫ్ కామన్స్’కు తెలిపి చర్చపై తేదీని నిర్ణయిస్తారు. కాగా ఈ క్షణం వరకు పిటిషన్‌పై 1,229,239 మంది సంతకాలు చేశారు.
 
అగ్రరాజ్య అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ యూకేలో అధికారికంగా పర్యటించగలరు. అయితే బ్రిటన్ నుంచి ఆయనకు ఆహ్వానం అందే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. మహిళలపై ట్రంప్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు, స్త్రీల పట్ల ఆయనకున్న ద్వేషాన్ని బ్రిటన్ రాణి తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో యూకేలో ట్రంప్ అధికారిక పర్యటనకు ఆహ్వానించే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించడం లేదు. మరోవైపు తన భర్త ట్రంప్ పైన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తీవ్రమైన వ్యతిరేకత రావడంపై ట్రంప్ భార్య మలేనియా షాక్‌కు గురవుతున్నారట. కానీ అదేమీ ట్రంప్ పట్టించుకోవడంలేదట. తన దారి రహదారి అన్న చందంగా దూసుకవెళుతున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుణ్ జైట్లీ బడ్జెట్-2017 : రూపాయ రాక, రూపాయి పోక