ట్రంప్ ఓ దేశాధ్యక్షుడేనా? మరో దేశ ప్రధానికి వెనక్కి నెట్టేశాడు... MUST WATCH VIDEO
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే తన వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో అంతర్జాతీయ మీడియా దృష్టిని నేత డోనాల్డ్ ట్రంప్. దీంతో ఆయనను వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా మ
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే తన వివాదాస్పద వ్యాఖ్యలు చేష్టలతో అంతర్జాతీయ మీడియా దృష్టిని నేత డోనాల్డ్ ట్రంప్. దీంతో ఆయనను వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ఈ నేపథ్యంలో.. తాజాగా మరోమారు వార్తల్లోకెక్కాడు.
అగ్రదేశానికి అధినేతను అనే అహంకారం వల్లో లేక, సహజసిద్ధంగా తనకు వచ్చిన దూకుడు వల్లో కానీ... ఏకంగా ఓ దేశ ప్రధానినే వెనక్కి నెట్టేసి తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇతర దేశాధినేతలతో కలసి నడుస్తున్న సమయంలో, తన ముందు నడుస్తున్న మాంటెనెగ్రో దేశ ప్రధాని డస్కో మార్కోవిక్ను ఆయన పక్కకు నెట్టి, ముందుకు వచ్చి నిలబడి తన దర్పం ప్రదర్శించి మీడియాకు ఫోజులిచ్చాడు. ఫొటోలకు పోజులిచ్చే సమయంలో ఇది జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో మీరూ చూడండి.